Allu Arjun And Rakul Preet Singh: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ప్రస్తుతం అట్లీ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. గత కొన్నిరోజులుగా ఆయన ముంబై లోనే ఉంటున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ముంబై లో ఉంటున్న ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) అల్లు అర్జున్ ని ఆయన సతీమణి స్నేహా రెడ్డి ని డిన్నర్ కి ఆహ్వానించగా, అల్లు అర్జున్ నిన్న రాత్రి ఆమె ఇంటికి డిన్నర్ కి హాజరై, తిరిగి కారులో వెళ్తున్న వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అల్లు అర్జున్ కి ఇండస్ట్రీ లో అత్యంత ఆప్తులుగా, ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్ లో ఒకరిగా రకుల్ ప్రీత్ సింగ్ ఎన్నో ఏళ్ళ నుండి కొనసాగుతూ వస్తోంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతం లో ‘సరైనోడు’ అనే చిత్రం కూడా వచ్చింది.
ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం థియేటర్స్ లోనే కాదు, టీవీ టెలికాస్ట్ లో కూడా ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, ఇప్పటికీ టెలికాస్ట్ అయినప్పుడు మంచి టీఆర్ఫీ రేటింగ్స్ ని నమోదు చేసుకుంటూ ఉంటుంది ఈ చిత్రం. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దరు మంచి స్నేహితులు అయ్యారు. అప్పటి నుండి అదే తరహా స్నేహం తో మెలుగుతూ వస్తున్న వీళ్లిద్దరు సమయం దొరికినప్పుడల్లా కుటుంబ సమేతంగా కలుసుకుంటూ ఉంటారు. అలా మొన్న డిన్నర్ లో వీళ్లిద్దరి కుటుంబాలు కలుసుకున్నాయి. అందుకు సంబంధించిన వీడియో ని మీరు క్రింద చూడొచ్చు. సరైనోడు చిత్రం తర్వాత వీళ్లిద్దరు మంచి స్నేహితులు అయినప్పటికీ, మళ్లీ కలిసి ఎలాంటి సినిమా చేయలేదు. భవిష్యత్తులో చేసే అవకాశం కూడా కనిపించడం లేదు.
ఒకప్పుడు సౌత్ లో బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా రకుల్ ప్రీత్ సింగ్ వరుస సినిమాలతో ఎంత బిజీ గా ఉండేదో మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్, ప్రభాస్ తో తప్ప స్టార్ హీరోలందరితో ఈమె సినిమాలు చేసింది. ఈమధ్య కాలం లో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం తో రకుల్ బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వెళ్ళింది. అక్కడ కూడా ఈమెకు అదృష్టం కలిసి రావడం లేదు. ప్రస్తుతం ఈమె చేతుల్లో హీరోయిన్ గా ఎలాంటి క్రేజీ ప్రాజెక్ట్ లేదు. కానీ బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాయణం మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్ సూర్పనక్క క్యారక్టర్ చేస్తుంది. రామాయణంలో సూర్పనక్క రాక్షసి అనే విషయం తెలిసిందే. కెరీర్ లో తొలిసారి విలన్ క్యారక్టర్ చేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ పాత్రలో ఆమెని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
ICONSTAR @Alluarjun papped exiting post dinner at @Rakulpreet house in mumbai #AA22 #AA23 pic.twitter.com/X3O1hJRssk
— (@AlluArjunCult09) January 26, 2026