Rashmika Mandanna item song: పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న వారిలో ఒకరు రష్మిక మందాన(Rashmika Mandanna). కన్నడ సినీ పరిశ్రమ ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన రష్మిక మందాన, ఆ తర్వాత మన టాలీవుడ్ లోకి ‘ఛలో’ అనే సూపర్ హిట్ చిత్రం ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె చేసిన ‘గీత గోవిందం’ చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో యూత్ ఆడియన్స్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. అలా మొదలైన రష్మిక కెరీర్, పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్ కి చేరింది. ఇప్పుడు బాలీవుడ్ లో ఈమె పట్టిందల్లా బంగారం లాగా మారిపోయింది. రీసెంట్ గా టాలీవుడ్ లో కూడా ఈమె ‘గర్ల్ ఫ్రెండ్’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసి సూపర్ హిట్ ని అందుకుంది.
అయితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘ప్రేక్షకులకు అన్ని జానర్స్ లో వినోదాన్ని అందించడమే నా లక్ష్యం. అన్ని రకాల పాత్రలు చేయాలి అనేదే నా గోల్. అందుకే కమర్షియల్ , లవ్ స్టోరీ, లేడీ ఓరియెంటెడ్, హిస్టారికల్ ఇలా అన్న రకాల జానర్ సినిమాలు చేస్తున్నాను. ఇకపైన కూడా ఇలాంటి కథలనే ఎంచుకుంటాను. చాలా మంది నన్ను స్పెషల్ సాంగ్స్ చేస్తారా అని అడుగుతున్నారు. నాకు కూడా స్పెషల్ సాంగ్స్ చేయడం పై ఆసక్తి ఉంది, కానీ ఆ చిత్రంలో హీరోయిన్ గా నేనే ఉండాలి. అలా అయితే స్పెషల్ సాంగ్స్ చేస్తాను. అలా కాకుండా ఒక నలుగురు డైరెక్టర్స్ కోసం నేను పెట్టుకున్న షరతు ని బ్రేక్ చేసి స్పెషల్ సాంగ్స్ చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.
రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ ‘చాలా మంది ఇండియా లో నేను అందరికంటే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ అని ప్రచారం చేస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. వాళ్ళు ప్రచారం చేసే ఆ రూమర్ నిజం అవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక విజయ్ దేవరకొండ తో ప్రేమాయణం, నిశ్చితార్థం, పెళ్లి గురించి సమయం వచ్చినప్పుడు చెప్తాను అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో ‘కాక్టెయిల్ 2’ లో నటిస్తుంది. ఇక మన టాలీవుడ్ లో ఆమె ‘మైసా’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది. ఇవి రెండు కాకుండా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ మూవీ లో ఈమె విలన్ క్యారెక్టర్ చేయబోతుంది. ఇలా విభిన్నమైన సినిమాలతో ఆమె త్వరలోనే ఆడియన్స్ ని అలరించబోతుంది.
