Sushmita Konidela: మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో తనకున్న రికార్డులు ఆయనను చాలా గొప్పగా పరిచయం చేస్తూ ఉంటాయి. 70 సంవత్సరాల వయసులో కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా సినిమాలను చేస్తున్న ఘనత తనకే దక్కుతుంది. అలాంటి చిరంజీవి రీసెంట్ గా ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఈ సినిమాకి తన కూతురు అయిన సుష్మిత ఒక ప్రొడ్యూసర్ గా కొనసాగిన విషయం మనకు తెలిసిందే. ఇక మరో ప్రొడ్యూసర్ గా సాహు గారపాటి వ్యవహరించారు. వీళ్ళిద్దరు కలిసి ఈ సినిమా కోసం 150 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. ఇందులో సుష్మిత కొణిదల 75 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ సినిమా ఇప్పుడు 400 కోట్ల మార్క్ ను టచ్ చేస్తున్న క్రమంలో దాదాపు 200 కోట్ల వరకు రిటర్న్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అంటే తను పెట్టిన పెట్టుబడి 75 కోట్లు తీసేస్తే ఆమెకు దాదాపు 125 కోట్ల వరకు ప్రాఫిట్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి తన కూతుర్ని స్టార్ ప్రొడ్యూసర్ గా మార్చాలనే ఉద్దేశ్యంతో తను చేస్తున్న ఈ కమర్షియల్ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించమని చెప్పినట్టుగా తెలుస్తుంది.
ఎలాగూ అనిల్ రావిపూడి చేసే సినిమా సక్సెస్ ని సాధిస్తుందని చిరంజీవికి తెలుసు…ఒకవేళ తేడా కొట్టిన కూడా ఈ సినిమా పెట్టిన బడ్జెట్ ను రికవరీ చేయగలదనే నమ్మకం చిరంజీవికి ఉంది. కాబట్టే సాహు గారపాటి గారితో కొలాబ్రేట్ చేసి మరి సుస్మిత ని ప్రొడ్యూసర్ గా పరిచయం చేశాడు.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా వల్ల సుష్మిత మంచి ప్రొడ్యూసర్ గా అవతరించిందే రాబోయే సినిమాలతో కూడా ఆమె సక్సెస్ ఫుల్ సినిమాలను చేయగలిగితే టాప్ ప్రొడ్యూసర్ గా మారుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…