Homeఎంటర్టైన్మెంట్పరశురామ్ పంట పండింది

పరశురామ్ పంట పండింది

2008 లో నిఖిల్ హీరోగా ‘యువత’ సినిమాతో డైరెక్టర్ గా మారిన పరుశురాం ఇన్నాళ్ళకి తన కల నెరవేర్చుకో గలుగుతున్నాడు. సరిగ్గా పన్నెండు ఏళ్ళ తరవాత స్టార్ హీరో ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించు కొన్నాడు. రీసెంట్ గా ‘సరిలేరు నీకెవ్వరు’తో భారీ హిట్ అందుకున్న మహేశ్ బాబు నటించే 27వ సినిమాను తాను డైరెక్ట్ చేయనున్నాడు. నిజానికి మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నాడు. దిల్ రాజు నిర్మాతగా ఆ సినిమాను […]

2008 లో నిఖిల్ హీరోగా ‘యువత’ సినిమాతో డైరెక్టర్ గా మారిన పరుశురాం ఇన్నాళ్ళకి తన కల నెరవేర్చుకో గలుగుతున్నాడు. సరిగ్గా పన్నెండు ఏళ్ళ తరవాత స్టార్ హీరో ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించు కొన్నాడు. రీసెంట్ గా ‘సరిలేరు నీకెవ్వరు’తో భారీ హిట్ అందుకున్న మహేశ్ బాబు నటించే 27వ సినిమాను తాను డైరెక్ట్ చేయనున్నాడు. నిజానికి మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నాడు. దిల్ రాజు నిర్మాతగా ఆ సినిమాను నిర్మించడానికి రెడీ అయినాక వంశీ పైడిపల్లి చెప్పిన కథ విని నచ్చకపోవడంతో నో చెప్పేశాడు. దాంతో ఆ అవకాశం పరశురామ్ కి దక్కింది.

ముఖ్యంగా మహేశ్ బాబు నటించ బోయే 27 చిత్రానికి దర్శకుడిగా పరుశురాం పేరు ఖరారు కాక మునుపు చాల మంది దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం దాదాపు మహేష్ నెక్స్ట్ మూవీని పరుశురామ్ డైరెక్ట్ చేయడం ఖాయమైంది. ‘గీత గోవిందం’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు రెండేళ్లుగా పెద్ద అవకాశం కోసం వెయిట్ చేసిన పరుశురామ్ చివరకు మహేష్ బాబు ని తన కథతో లాక్ చేసుకున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ తో పాటు మహేష్ బాబు ఓన్ ప్రొడక్షన్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంస్థ కూడా ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోనుందని తెలుస్తోంది . మే నెలలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించి జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని 2021 వేసవిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
Patience is bitter but it`s fruits are very sweet.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper