Homeఆంధ్రప్రదేశ్‌Borugadda Anil Kumar: జగన్ తో బోరుగడ్డది పరిచయం ఈనాటిది కాదా!

Borugadda Anil Kumar: జగన్ తో బోరుగడ్డది పరిచయం ఈనాటిది కాదా!

Borugadda Anil Kumar: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రవేశం లేదని తెగ బాధపడుతున్నారు బోరుగడ్డ అనిల్ కుమార్. ఏకంగా తన భార్యతో కలిసి తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సజ్జల రామకృష్ణారెడ్డి తన చుట్టూ కుట్ర పన్నుతున్నారని ఆరోపణ చేశారు. తనకు జగన్మోహన్ రెడ్డి తో పాటు భారతమ్మతో మంచి పరిచయం ఉందని.. వారి ప్రోత్సాహంతోనే తాను వైసీపీలో ఎదిగానని చెబుతున్నారు. కానీ కారుమూరి వెంకట్ రెడ్డి లాంటి వాళ్లు బోరుగడ్డకు […]

Borugadda Anil Kumar: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రవేశం లేదని తెగ బాధపడుతున్నారు బోరుగడ్డ అనిల్ కుమార్. ఏకంగా తన భార్యతో కలిసి తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సజ్జల రామకృష్ణారెడ్డి తన చుట్టూ కుట్ర పన్నుతున్నారని ఆరోపణ చేశారు. తనకు జగన్మోహన్ రెడ్డి తో పాటు భారతమ్మతో మంచి పరిచయం ఉందని.. వారి ప్రోత్సాహంతోనే తాను వైసీపీలో ఎదిగానని చెబుతున్నారు. కానీ కారుమూరి వెంకట్ రెడ్డి లాంటి వాళ్లు బోరుగడ్డకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో అసలు సంబంధం లేదని తేల్చి చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా ఆయనకు ప్రవేశం లేకుండా పోయింది. అయితే జగన్మోహన్ రెడ్డితో బోరుగడ్డది ఇప్పటి పరిచయం కాదు అని తేలిపోయింది. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలతో పాటు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

* పార్టీ తరపున బలమైన వాయిస్..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి బోరుగడ్డ అనిల్ కుమార్ చాలా యాక్టివ్ గానే కనిపించారు. అయితే అది పార్టీ కార్యక్రమాల్లో మాత్రం కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సోషల్ మీడియాలో బలమైన వాయిస్ వినిపించేవారు. ఈ క్రమంలోనే రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేసేవారు. ఒకటి మాత్రం స్పష్టం అవుతోంది. పార్టీ సోషల్ మీడియా విభాగం ఆయనతో అలా మాట్లాడించేది అని అర్థం అవుతోంది. ఇప్పుడు బోరుగడ్డ చెప్పేది కూడా అదే. పార్టీ చెప్పినట్లు నడుచుకున్నానని… తీరా ఇప్పుడు కష్టాల్లో విడిచి పెట్టేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వ్యాపారాలు సైతం దెబ్బతిన్నాయి. బ్యాంకు లావాదేవీలు సైతం నిలిచిపోయాయి. ఎక్కువ కాలం జైల్లో ఉండడంతో ఆరోగ్యం కూడా దెబ్బతింది. అయితే తమ పార్టీ కోసం అంతలా చేసిన బోరుగడ్డ అనిల్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వదిలించుకునే ప్రయత్నం చేస్తుంది అని తాజా పరిస్థితులు తెలియజేస్తున్నాయి.

* పాత వీడియోలు వైరల్..
బోరుగడ్డ అనిల్ కుమార్ మాత్రం తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడినని.. అధినేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఎక్కువగా సమర్ధించే వాడినని.. జగనన్న సైనికుడినని చెబుతుంటారు. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు చూస్తుంటే మాత్రం అది నిజమేనని తెలుస్తోంది. ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి జగన్ బయటకు వచ్చినప్పుడు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతుండడంతో బోరుగడ్డ చెప్పింది నిజమేనని తెలుస్తోంది. ఆయనతో అనరాని మాటలు అనిపించి.. తీరా వైసీపీకి డామేజ్ జరుగుతుందని ఆయనను దూరం పెడుతున్నట్లు అర్థం అవుతోంది. ఒకటి మాత్రం నిజం. ఏదైనా రాజకీయ పార్టీ అండదండలు ఉన్నాయని.. వారిచ్చిన కంటెంట్ తో ఇష్ట రాజ్యంగా మాట్లాడితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో బోరుగడ్డను చూస్తే ఇట్టే అర్థం అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Power Telugu TV (@powertelugutv)

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper