Today 7 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు ఏదంటే అది అవుతుంది. మరికొన్ని రాశుల వారు విలాసాలకు ఖర్చులు చేస్తారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి ఆర్థిక వ్యవహారాలు ఈరోజు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉండకపోవచ్చు. అధికారుల ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. కళా రంగంలో పనిచేసే వారికి అనుకూలమైన సమయం. కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే కొత్త వస్తువుల కొనుగోలులో జాగ్రత్తలు వ్యవహరించాలి.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏదైనా వస్తువు కొనేటప్పుడు వాయిదా వేసుకునే ప్రయత్నం చేయాలి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు. కానీ సాధ్యమైనంతవరకు వాయిదా వేసుకోవడం మంచిది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త వ్యక్తులను కలిస్తే వారితో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు కష్టపడిన దానికి సరైన ఫలితం ఉంటుంది. వృత్తిపరంగా అన్ని కలిసి వస్తాయి. ప్రియమైన వారితో జాగ్రత్తగా ఉండాలి. మాటల మాధుర్యంతో వారిని ఆకట్టుకుంటారు. అయితే అనవసరంగా వారిని మాటలతో ఇబ్బందులు పెట్టొద్దు. ఉద్యోగులకు కొత్త ఆదాయం మార్గాలు ఏర్పడతాయి. స్నేహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఉద్యోగులు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వినియోగ రంగంలో పనిచేసే వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయం చేకూరుతుంది. వ్యాపారులకు కలిసి రావడంతో లాభాలు ఉంటాయి.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని పనులను ధైర్యంగా చేయడానికి ముందుకు వస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో సంతోషంగా గడుపుతారు. అధికారుల అండదండలు ఉండడంతో ఉద్యోగులు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. దూర ప్రయాణాల పట్ల ఆసక్తిని చూపుతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. అనైతిక సంబంధాలకు దూరంగా ఉండటమే మంచిది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. చిన్నపాటి సమస్యలు రాకుండా చూడాలి. పిల్లల కెరీర్ పై కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు ఊహించని లాభం ఉంటుంది. ఉద్యోగులకు కలిసి రావడంతో అదనపు ఆదాయం చేకూరుతుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులు జీవిత భాగస్వామితో షాపింగ్ చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొనడంతో సంతోషంగా గడుపుతారు. కొన్ని విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. బంధువుల నుంచి శుభవార్తలో అందుతాయి. నిరుద్యోగులకు కలిసి వస్తుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారులకు తోటి భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఫలితంగా అతని వ్యాపారం చేయడానికి ఉత్సాహం చూపుతారు. పాత బాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కళా రంగంలో ఉండే వారికి కలిసి వస్తుంది. అనుకోకుండా ధన లాభం వచ్చే అవకాశం ఉంది. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. పిల్లల నైపుణ్య ప్రదర్శనతో బహుమతులు పొందే అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో పాల్గొంటే రాణిస్తారు. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉండడంతో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఆస్తి వ్యవహారాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విలాసాల కోసం ఖర్చులు చేయవద్దు. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు పెరిగిపోతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆగిపోయిన డబ్బులు వసూలు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.