Parotta Master Salary: బి ఏ లు చదివినా.. ఎంఏ లు చదివినా.. పొట్టకూటికే కదా డిగ్రీలు.. ఎంసెట్ చేజారినా.. అప్సెట్ అవ్వకు బ్రదర్ ఆఫ్ట్రాలూ.. అప్పట్లో విపరీతంగా ఆదరణ పొందిన ఓ సినిమాలో పాపులర్ పాట ఇది. ఇప్పటికాలానికి ఇది నూటికి నూరు శాతం కాదు కోటి సరిపోతుంది.
ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు అంతంత మాత్రం. ప్రభుత్వాలు భర్తీ చేస్తున్న ఉద్యోగాలు కూడా అంతంత మాత్రమే. ఉద్యోగాల కోసం విపరీతమైన పోటీ ఉంది. ప్రభుత్వ ఉద్యోగం అంటే సెక్యూరిటీ లైఫ్ ఉంటుంది. ప్రతినెల 1వ తేదీన జీతం వస్తుంది. ఇంకా అదనపు ప్రయోజనాలు.. అందువల్లే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని చాలామంది అనుకుంటారు. కాకపోతే అనుకున్న స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు కాబట్టి.. అందరికీ గవర్నమెంట్ జాబ్ లు దక్కవు.
గత కొంతకాలంగా ప్రభుత్వ రంగాన్ని మించి ప్రైవేట్ రంగం ఎదుగుతోంది. ప్రైవేట్ రంగంలో విపరీతంగా అవకాశాలు లభిస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రైవేట్ రంగం కూడా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నది. ప్రైవేట్ రంగం మీద ఆధారపడి పనిచేస్తున్న వారంతా ఉద్యోగాలు కోల్పోతున్నారు.. ఆర్థికంగా ఒత్తిడి ఎదుర్కొంటూ కష్టాలు పడుతున్నారు. అయితే కొన్ని ఉద్యోగాలు మాత్రం చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఆ ఉద్యోగాలకు చెల్లించే వేతనాలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలను మించి ఉంటున్నాయి.
కోయంబత్తూర్ ప్రాంతంలో పరోటాలు విపరీతమైన ఫేమస్. అక్కడ కుత్తు పరోట అద్భుతంగా ఉంటుంది. అక్కడ పరోటాలు తినే వారి సంఖ్య పెరిగిపోతుంది. అందువల్లే కోయంబత్తూర్ ప్రాంతంలో పరోటాలు తయారు చేసే వారికి డిమాండ్ పెరిగింది. అందువల్లే పరోటా మాస్టర్ పేరుతో ఒక ఐడి నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. కోయంబత్తూర్ ప్రాంతంలో పరోటాలు తయారు చేసే వాళ్ళు కావలెను. నెలకు 36 వేల నుంచి 42,000 చెల్లిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పార్ట్ టైం. ఫుల్ టైం.. అంటూ అందులో ప్రస్తావించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గొప్ప గొప్ప డిగ్రీలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని.. పరోటాలు చేసే వారికి డిమాండ్ పెరిగిపోయిందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల కాలంలో కోయంబత్తూరు ప్రాంతంలో పరోటాల హోటళ్లు విపరీతంగా ఏర్పాటయ్యాయి. వాటిని తినే వారే సంఖ్య పెరిగిపోయింది. అందువల్లే మాస్టర్లకు డిమాండ్ పెరిగింది.
View this post on Instagram