Homeఎంటర్టైన్మెంట్Shankar: శంకర్ డైరెక్షన్ లో మహేష్ బాబు ఆ సినిమాను రిజెక్ట్ చేయడానికి అసలు కారణం...

Shankar: శంకర్ డైరెక్షన్ లో మహేష్ బాబు ఆ సినిమాను రిజెక్ట్ చేయడానికి అసలు కారణం ఇదే…

Shankar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా ఆయన డిఫరెంట్ సినిమాలను చేసుకుంటూ ప్రేక్షకులను మైమరపింపజేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే తనతో సినిమాలు చేయడానికి చాలామంది స్టార్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపిస్తుండటం విశేషం…ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న శంకర్ సైతం మహేష్ బాబుతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ అనుకోని కారణాలవల్ల […]

Shankar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా ఆయన డిఫరెంట్ సినిమాలను చేసుకుంటూ ప్రేక్షకులను మైమరపింపజేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే తనతో సినిమాలు చేయడానికి చాలామంది స్టార్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపిస్తుండటం విశేషం…ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న శంకర్ సైతం మహేష్ బాబుతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా అయితే సెట్ అవ్వలేదు. ఇంతకీ వీళ్లిద్దరి కాంబినేషన్లో చేయాలనుకున్న సినిమా ఏంటంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో అమీర్ ఖాన్ హీరోగా చేసిన ‘త్రీ ఇడియట్స్’ మూవీ కావడం విశేషం…ఈ సినిమా శంకర్ కి బాగా నచ్చడంతో ఆ మూవీ రీమేక్ రైట్స్ తీసుకోని మహేష్ బాబు తో రీమేక్ చేయాలనుకున్నాడు. తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమాని చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. కానీ మహేష్ బాబు మాత్రం అప్పుడు శ్రీను వైట్లతో దూకుడు సినిమా చేస్తుండటం వల్ల త్రి ఇడియట్స్ రీమేక్ ను వదిలేశాడు. దూకుడు కథ అతనికి బాగా నచ్చడం ఆ సినిమా కూడా అద్భుతంగా వస్తుందని మహేష్ బాబు నమ్మడంతో త్రి ఇడియట్ సినిమా రీమేక్ ని మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు. దాంతో శంకర్ విజయ్ కు హీరోగా పెట్టి తమిళలో నంభన్, తెలుగులో స్నేహితుడు పేరుతో రీమేక్ చేశాడు.

మొత్తానికైతే ఈ సినిమా రెండు భాషల్లోనూ పెద్దగా ఆడలేదు. దాంతో శంకర్ మార్కెట్ ఒకసారిగా డౌన్ అయిపోయింది. అప్పటివరకు పరాజయం ఎరుగని శంకర్ ఈ సినిమాతో భారీ అపజయాన్ని మూటగట్టుకున్నాడు. దాంతో అప్పటినుంచి ఇప్పటివరకు శంకర్ వరుసగా సినిమాలను చేస్తూ రావడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా ఆ తర్వాత నుంచి శంకర్ చేస్తున్న సినిమాలు అతనికి సక్సెస్ నైతే తీసుకురాలేదు. మొత్తానికైతే శంకర్ డైరెక్షన్ లో మహేష్ బాబు నటించకపోవడమే మంచిదైందని అతని అభిమానులు అభిప్రాయపడ్డారు. నిజానికి దూకుడు సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ఫుల్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

ఆ సమయంలో మహేష్ బాబు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని అతని అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఒకరకంగా మహేష్ బాబు సినిమాల సెలెక్షన్ విషయంలో ఆచి తూచి ముందుకు ముందుకు అడుగులు వేశాడు కాబట్టే ఈరోజు ఇండస్ట్రీ లో ఉన్న టాప్ హీరోల్లో మహేష్ బాబు కూడా ఒకరుగా ఎదిగాడనేది వాస్తవం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper