Homeఎంటర్టైన్మెంట్Bashir Master: చివరికి డాన్స్ మాస్టర్ బషీర్ పరిస్థితి..ఇలా అయిపోయింది

Bashir Master: చివరికి డాన్స్ మాస్టర్ బషీర్ పరిస్థితి..ఇలా అయిపోయింది

Bashir Master: తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది డ్యాన్స్ మాస్టర్ లు ఉన్నారు. ఇప్పుడు అంటే శేఖర్.. జానీ మాస్టర్ లు హవా కొనసాగిస్తున్నారు. కానీ అప్పట్లో బషీర్ మాస్టర్ కూడా శేఖర్, జానీ మాదిరిగానే ఫేమస్. కాకపోతే కొన్ని వ్యవహారాలు అతడిని ఫేడ్ ఔట్ చేసేశాయి. బషీర్ మాస్టర్ లో టాలెంట్ ఉంది. కానీ నోటి దురుసు వల్ల అతడు అవకాశాలు కోల్పోయాడు. సినిమా ఇండస్ట్రీలో ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి. లౌక్యాన్ని అలవర్చుకోవాలి. […]

Bashir Master: తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది డ్యాన్స్ మాస్టర్ లు ఉన్నారు. ఇప్పుడు అంటే శేఖర్.. జానీ మాస్టర్ లు హవా కొనసాగిస్తున్నారు. కానీ అప్పట్లో బషీర్ మాస్టర్ కూడా శేఖర్, జానీ మాదిరిగానే ఫేమస్. కాకపోతే కొన్ని వ్యవహారాలు అతడిని ఫేడ్ ఔట్ చేసేశాయి.

బషీర్ మాస్టర్ లో టాలెంట్ ఉంది. కానీ నోటి దురుసు వల్ల అతడు అవకాశాలు కోల్పోయాడు. సినిమా ఇండస్ట్రీలో ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి. లౌక్యాన్ని అలవర్చుకోవాలి. సాధ్యమైనంతవరకు మర్యాద పురుషోత్తముడి మాదిరిగా కనిపించాలి. మన లోపల ఎన్ని భావాలు ఉన్నప్పటికీ.. వాటిని ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తం చేయకూడదు. ముఖ్యంగా అకారణంగా నోరు పారేసుకోకూడదు. దీనివల్ల సినిమా పెద్దల అహాలు దెబ్బతింటాయి. వాటి వల్ల అవకాశాలు దూరమవుతాయి. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దూరమైతే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

బషీర్ మాస్టర్ కు అవకాశాలు లేకపోవడంతో అతడు చిన్నచిన్న ఈవెంట్లకు వెళ్తున్నాడు. యూట్యూబ్ చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. కొంతమంది వ్యక్తులతో జట్టు కట్టి వీడియోలు తీసుకుంటున్నాడు. వాటిని సోషల్ మీడియాలోకి ఎక్కిస్తున్నాడు. వాస్తవానికి బషీర్ స్థాయికి ఇటువంటి వీడియోలు అసలు సూట్ కావు. అన్ని అనుకూలంగా సాగి ఉంటే అతడు తన రేంజ్ కు ఎక్కడికో వెళ్లాల్సిన వాడు. కానీ.. స్థిత ప్రజ్ఞత లేని కారణంగా చివరికి అతడు ఇలా మారిపోయాడు.

ఇటీవల ఒక ఈవెంట్లో బషీర్ మాస్టర్ కనిపించాడు. వాస్తవానికి అతని స్థాయికి అది చాలా చిన్నది. కాకపోతే పొట్టకూటి కోసం తప్పదు కాబట్టి.. ఆ ఈవెంట్ లో అతడు డ్యాన్స్ చేశాడు. అతడు డాన్స్ చేస్తుంటే చాలామంది అదో విధంగా చూశారు. ఒకప్పటి మాదిరిగా అతనిలో గ్రేస్ లేదు. కాళ్లల్లో వేగవంతమైన కదలికలు లేవు. ముఖంలో హావ భావాలు లేవు. చేయాలి కాబట్టి డ్యాన్స్ చేశాడు. అతడి దుస్థితి చూసి చాలామంది బాధపడుతున్నారు. బషీర్ మాస్టర్ నోటిని అదుపులో పెట్టుకుంటే ఈ స్థితి వచ్చేది కాదు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.. సినిమా పరిశ్రమలోకి ఎంతో మంది వస్తుంటారు. ఎంతో మంది పోతుంటారు. కానీ స్థిరమైన వ్యక్తిత్వం ఉన్న వారే గట్టిగా నిలబడగలుతారు. ఈ మాత్రం కూడా తెలియని వారు పరిశ్రమ నుంచి వెళ్లిపోతుంటారు. అవకాశాలు లభించక ఏదో ఒక పని చేసుకుంటుంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper