Homeఎంటర్టైన్మెంట్Hebba Patel : ఫ్రాక్ లో కిరాక్ ఫోజులు... కుమారి 21 ఫేమ్ హెబ్బా గ్లామరస్...

Hebba Patel : ఫ్రాక్ లో కిరాక్ ఫోజులు… కుమారి 21 ఫేమ్ హెబ్బా గ్లామరస్ లుక్ వైరల్!

Hebba Patel : మంచి ఆరంభం లభించినా హెబ్బా పటేల్ కి కాలం కలిసి రాలేదు. కథ ఎంపికలో తడబడిన అమ్మడు ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది. హెబ్బా పటేల్ అధ్యక్ష అనే కన్నడ మూవీతో వెండితెరకు పరిచయమైంది. తెలుగులో అలా ఎలా? అనే ఒక చిన్న చిత్రంతో అడుగుపెట్టింది. అయితే కుమారి 21ఎఫ్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. 2015లో సుకుమార్ నిర్మాతగా కుమారి 21 ఎఫ్ తెరకెక్కింది. పలనాటి సూర్య ప్రతాప్ దర్శకుడు.

న్యూ ఏజ్ డ్రామా తెరకెక్కిన కుమారి 21 ఎఫ్ యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఊహించని విజయం సాధించింది. హీరో రాజ్ తరుణ్ కెరీర్లో భారీ హిట్ గా కుమారి 21ఎఫ్ నిలచింది. అయితే అదే ఆమెకు చివరి హిట్. ఒకటి రెండు చిత్రాలు పర్లేదు అనిపించినా ఆమెకు ఫేమ్ తేలేకపోయాయి. అలాగే హెబ్బా స్మాల్, మీడియం బడ్జెట్ చిత్రాలకే పరిమితం చేశారు. కనీసం టైర్ టు హీరోలు కూడా ఆమెకు ఆఫర్స్ ఇవ్వలేదు.

శ్రీను వైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ కి జంటగా మిస్టర్ మూవీ చేసింది. అది అట్టర్ ప్లాప్. 2017 తర్వాత హెబ్బా కెరీర్ నెమ్మదించింది. ఈ క్రమంలో గెస్ట్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ కి పడిపోయింది. భీష్మ మూవీలో చిన్న పాత్ర చేసింది. రామ్ పోతినేని రెడ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆఫర్స్ లేకపోవడంతో ఒంటిపై కూడా శ్రద్ద వదిలేసింది. ఊహించని విధంగా హెబ్బా బరువు పెరిగింది. రెడ్ మూవీ సాంగ్ లో హెబ్బాను గుర్తించలేకపోయాము.

మరలా శ్రమించి మునుపటి షేప్ సాధించింది. హెబ్బా డిజిటల్ సిరీస్లు, చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం శాసనసభ, తెలిసిన వాళ్ళు అనే రెండు తెలుగు చిత్రాలు చిత్రాల్లో నటిస్తోంది. అలాగే మరో రెండు తమిళ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో చేస్తుంది. హీరోయిన్ గా రాణించాలంటే హాట్ ఫోటో షూట్స్ తప్పనిసరి. దర్శక నిర్మాతలు ఆఫర్స్ ఇవ్వాలంటే అందాలు ప్రదర్శించాల్సిందే. అందుకే హెబ్బా ఇంస్టాగ్రామ్ లో వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Hebah P (@ihebahp)

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper