Korean Kanakaraju First Review: 2026 ఫ్లాప్ హీరోల కం బ్యాక్ ఇయర్ గా మారిపోయింది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. దశాబ్దానికి పైగా వరుస డిజాస్టర్స్ తో , అసలు కోలుకుంటాడా లేదా అనే సందిగ్ద పరిస్థితిలో ఉన్నటువంటి తమిళ హీరో సూర్య ‘కరుప్పు’ వంటి భారీ హిట్ తో కం బ్యాక్ ఇచ్చి అందరినీ షాక్ కి గురయ్యేలా చేశారు. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ తో తిరుగులేని కం బ్యాక్ ఇవ్వగా, ‘మా ఇంటి బంగారం’ తో సమంత, ‘లెనిన్’ తో అక్కినేని అఖిల్ వంటి వారు ట్రేడ్ పండితులు కూడా ఆశ్చర్యపోయే రేంజ్ హిట్స్ తో భారీ కం బ్యాక్స్ ఇచ్చారు. ఇప్పుడు వరుణ్ తేజ్ వంతు వచ్చేసింది అనొచ్చు. అయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ వచ్చే నెల 7 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కానుంది.
ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ని చూస్తుంటే వరుణ్ తేజ్ కం బ్యాక్ పక్కా అనిపిస్తోంది. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి విభిన్న తరహా సినిమాలు చెయ్యాలంటే వరుణ్ తేజ్ తర్వాతే ఎవరైనా , మొత్తానికి ఈ చిత్రంతో భారీ కం బ్యాక్ ఇవ్వబోతున్నాడు అంటూ సోషల్ మీడియా లో విమర్శకులు కూడా ప్రశంసలు అందించారు. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ , ఆడియన్స్ థియేట్రికల్ ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే , ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ కాపీ ని ప్రివ్యూ షో గా రీసెంట్ గానే రామానాయుడు స్టూడియోస్ లోని థియేటర్ లో ప్రదర్శించారు. ఈ షో నుండి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ చాలా అద్భుతంగా కుదిరిందని , వరుణ్ తేజ్ , కమెడియన్ సత్య మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల పొట్ట చెక్కలు అయ్యేలా చేసిందని, ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వడం తథ్యం అంటూ కొంతమంది మీడియా ప్రతినిధులు ఫిలిం నగర్ లో మాట్లాడుకుంటున్నట్టు టాక్. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం తో పాటు , వరుణ్ తేజ్ నటన చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యిందని , ఆడియన్స్ ని ఒక సరికొత్త సినిమాని చూసిన అనుభూతి మాత్రమే కాకుండా, మంచి ఎంటర్టైన్మెంట్ తో , పూర్తి స్థాయి సంతృప్తి తో బయటకు వస్తారని అంటున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే మరో 10 రోజులు ఆగాల్సిందే.