Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టాక్ కి తగ్గట్టుగానే వసూళ్లు కూడా భారీ రేంజ్ లోనే వచ్చాయి. అయితే వరుస ఫ్లాప్స్ లో వరుణ్ తేజ్ కి ఈ సినిమా సక్సెస్ కాసా ఊరటని ఇచ్చిన మాట వాస్తవమే కానీ , ఆయన గత సూపర్ హిట్ సినిమాలతో పోలిస్తే గ్రాస్ వసూళ్లు చాలా తక్కువగానే వచ్చినట్టు తెలుస్తోంది. అయితే కొత్త సినిమాల రాకతో ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసిపోయింది. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఏ రేంజ్ వసూళ్లు వచ్చాయి ?, జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఎంత?, వచ్చిన లాభాలు ఎంత అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం.
ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి 7 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే విధంగా సీడెడ్ నుండి 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ మాత్రం ఆశించిన స్థాయి లో రన్ అవ్వలేదని చెప్పొచ్చు. ఇక ఆంధ్ర ప్రదేశ్ నుండి 7 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి దాదాపుగా 17 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 33 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 1 కోటి 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, ఓవర్సీస్ నుండి 2 కోట్ల 20 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి.
వరాల గా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 21 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు , 43 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 13 కోట్ల 50 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. విడుదల తర్వాత దాదాపుగా 7 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి. వరుణ్ తేజ్ రేంజ్ కి తగ్గ హిట్ కాకపోయినా, మంచి హిట్ అనే చెప్పాలి. కొత్త సినిమాల రాక లేకుంటే మరో 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చి ఉండేవని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.