Homeఎంటర్టైన్మెంట్Rishab Shetty: రిషబ్ శెట్టి 'శివాజీ' లో బెల్లవాడ మల్లమ్మ కథ వింటే మీకు రోమాలు...

Rishab Shetty: రిషబ్ శెట్టి ‘శివాజీ’ లో బెల్లవాడ మల్లమ్మ కథ వింటే మీకు రోమాలు నిక్కపొడుచుకుంటాయి..

Rishab Shetty: ఒకప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న రిషబ్ శెట్టి, ‘కాంతారా’ సిరీస్ తో హీరో గా కూడా సెన్సేషన్ సృష్టించి ఓవర్ నైట్ పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. నటుడిగా నేషనల్ అవార్డు ని కూడా ఆయన ఈ సిరీస్ తో సంపాదించారు. కాంతారా సిరీస్ వరకు డైరెక్టర్ గా , నటుడిగా రెగ్యులర్ గా కొనసాగిన రిషబ్ శెట్టి , ఇకపై పూర్తి స్థాయి హీరో గా స్థిరపడాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే ఆయన ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో ‘జై హనుమాన్’ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఆయన బాలీవుడ్ లో ఛత్రపతి మహారాజ్ బయోపిక్ లో కూడా నటిస్తున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది.

ఈ చిత్రం లో ‘బెలవాడి మల్లమ్మ’ గా ప్రముఖ యంగ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ నటిస్తున్నారట. అసలు ఎవరు మల్లమ్మ అనే విషయానికి వస్తే , ఈమె సోధే రాజ్యానికి (ఉత్తర కన్నడ జిల్లా) చెందిన మహిళా. చిన్నతనం నుండే ఈమె యుద్ధ విద్యల్లో ఆరి తీరింది. ఆరోజుల్లో ఈమె 20 పులులను వేటాడిన వ్యక్తిని పెళ్లాడుతానని సవాలు చేసింది. అప్పుడు బేలవాడి రాజు ఈసప్రభు ఏకంగా 21 పులుల్ని వేటాడి ఈమె పెళ్లాడాడు. 17 వ శతాబ్దం లో మరాఠా సైన్యంతో జరిగిన భీకర యుద్ధంలో ఈసప్రభు చనిపోగా, ఆయనకు బదులుగా మల్లమ్మ వీరోచితంగా శత్రు సైన్యం తో పోరాడింది అట. సాక్షాత్తు కాళీ మాత లాగా శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడుతున్న ఈమె వీరత్వం చూసి, ఛత్రపతి శివాజీ ఆమెని గౌరవిస్తూ రాజీ కి వచ్చారట. ఆ ఘట్టాన్ని ఈ చిత్రం లో అద్భుతంగా చూపించబోతున్నారట మేకర్స్.

ఇంతటి వీరోచిత పాత్ర కోసం భూమి పెడ్నేకర్ ని ఎంచుకోవడం గమనార్హం. ఈమె ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ , బాలీవుడ్ లో మాత్రం అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. కానీ ఇప్పటి వరకు ఈమె చేసిన పాత్రలు వేరు , ఈ పాత్ర వేరు. ఇది వరకు ఆమె పక్కింటి అమ్మాయి తరహా క్యారెక్టర్లు మాత్రమే చేసింది. మొదటి సారి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించబోతుంది. మరి ఈ క్యారెక్టర్ ని ఆమె ఎలా హ్యాండిల్ చేయబోతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper