Homeఎంటర్టైన్మెంట్Konda Surekha Apologizes Nagarjuna: నాగార్జునపై అర్ధరాత్రి కొండా సురేఖకు జ్ఞానోదయం అయ్యిందా?

Konda Surekha Apologizes Nagarjuna: నాగార్జునపై అర్ధరాత్రి కొండా సురేఖకు జ్ఞానోదయం అయ్యిందా?

Konda Surekha Apologizes Nagarjuna: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ సినీ నటుడు నాగార్జున కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కుమారుడు నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ అంటూ ఆరోపించారు. అంతేకాదు ఈ మాటలను పదేపదే ఆమె పేర్కొన్నారు. వాస్తవానికి నాగచైతన్య విడాకులు తీసుకుని అప్పటికే చాలా రోజులైంది. పైగా సమంత, నాగచైతన్య ఎవరి బతుకులు వారు బతుకుతున్నారు. చల్లారిపోయిన ఆ […]

Konda Surekha Apologizes Nagarjuna: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ సినీ నటుడు నాగార్జున కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కుమారుడు నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ అంటూ ఆరోపించారు. అంతేకాదు ఈ మాటలను పదేపదే ఆమె పేర్కొన్నారు. వాస్తవానికి నాగచైతన్య విడాకులు తీసుకుని అప్పటికే చాలా రోజులైంది. పైగా సమంత, నాగచైతన్య ఎవరి బతుకులు వారు బతుకుతున్నారు. చల్లారిపోయిన ఆ మంట మీద కొండా సురేఖ పెట్రోల్ పోశారు.. ఈ మంటల మీద గులాబీ పార్టీ నేతలు బ్రహ్మాండంగా చలి కాచుకున్నారు.

Also Read: శివ సినిమా ఫైట్ కోసం ఏకంగా ఫైట్ మాస్టర్ ని తీసేసిన వర్మ… ఇంట్రెస్టింగ్ స్టోరీ…

కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి.. ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. ఈ వ్యవహారం పై నాగార్జున ఏకంగా కోర్టు కు వెళ్లారు.. కొండ సురేఖ మీద పరువు నష్టం దావా వేశారు. సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో తన పేరు ప్రస్తావించడంతో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు కొండ సురేఖ మీద పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ సాగుతున్నట్టు తెలుస్తోంది. ఆ మధ్య ఈ కేసు విచారణ నేపథ్యంలో కొండా సురేఖ కోర్టుకు హాజరైనట్టు కూడా సమాచారం.

తన కుటుంబం మీద కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాగార్జున కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ఇలా ఉండగానే మంగళవారం అర్ధరాత్రి సురేఖ ట్విట్టర్ నుంచి ట్వీట్ వచ్చింది. అందులో కొండ సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. నాగార్జునను కించపరచాల్సిన ఉద్దేశం నాకు లేదు. నా వ్యాఖ్యల పట్ల వారు బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నాను. ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని” సురేఖ పేర్కొన్నారు. అర్ధరాత్రి 12 గంటలకు సురేఖ ఈ ట్వీట్ చేయడం విశేషం. నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. బహుశా అందువల్లే సురేఖ ఈ ట్వీట్ చేసి ఉంటారని తెలుస్తోంది.

ఆ మధ్య కొండ సురేఖ కుమార్తె సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సురేఖ మాజీ ఓఎస్డి కోసం పోలీసులు వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులతో సుస్మిత వాగ్వాదానికి దిగింది.. అదే సమయంలో కొంతమంది మంత్రుల మీద.. ముఖ్యమంత్రి మీద సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ పరిణామంపై కూడా సురేఖ స్పందించారు. ముఖ్యమంత్రికి క్షమాపణ కూడా చెప్పారు. దానిని మర్చిపోక ముందే నాగార్జునకు క్షమాపణ చెప్పి వార్తల్లో నిలిచారు కొండ సురేఖ.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper