Homeఎంటర్టైన్మెంట్Rana Latest Look: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన రానా.. పాపం ఎలా ఉండేవాడు.. ఎలా అయిపోయాడు!

Rana Latest Look: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన రానా.. పాపం ఎలా ఉండేవాడు.. ఎలా అయిపోయాడు!

Rana Latest Look: మన తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లడానికి కృషి చేసిన పాన్ ఇండియన్ హీరోల్లో , దగ్గుబాటి రానా కూడా ఒకరు. ‘బాహుబలి’ సిరీస్ లో ఆయన పోషించిన భళ్లాలదేవ పాత్ర, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఐకానిక్ విలన్ పాత్రల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా తర్వాత రానా రేంజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్తుందని అనుకున్నారు కానీ , ఆరోగ్య సమస్యల కారణంగా […]

Rana Latest Look: మన తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లడానికి కృషి చేసిన పాన్ ఇండియన్ హీరోల్లో , దగ్గుబాటి రానా కూడా ఒకరు. ‘బాహుబలి’ సిరీస్ లో ఆయన పోషించిన భళ్లాలదేవ పాత్ర, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఐకానిక్ విలన్ పాత్రల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా తర్వాత రానా రేంజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్తుందని అనుకున్నారు కానీ , ఆరోగ్య సమస్యల కారణంగా , సినిమాల సంఖ్య బాగా తగ్గించారు. హీరో పాత్రలకు కూడా బాగా దూరం అయ్యారు. ఎక్కువగా వ్యాపారం పైన, సినిమాల నిర్మాణాల పైన ఫోకస్ పెట్టారు. ఆయన మనసుకి నచ్చితే అప్పుడప్పుడు కొన్ని కీలక పాత్రలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రానా కి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి.

ఈ ఫోటోలలో రానా లుక్ ని చూసిన నెటిజెన్స్ తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. హల్క్ లాంటి శరీరం తో రెడ్ బుల్ లాగా కనపడే రానా, ఇలా అకస్మాత్తుగా చీపురు పుల్ల లాగా మారిపోయాడేంటి?, అసలు రానా కి ఏమైంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ ఆ ఆరోగ్య సమస్యలు తీవ్ర రూపం దాల్చాయా?, అందుకే ఆయన లుక్స్ ఇలా తయారైందా?, అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అభిమానులు భయపడాల్సిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే అది రానా దగ్గుబాటి ‘జై హనుమాన్’ మూవీ కి సంబంధించిన లుక్. ఈ చిత్రం లో రానా అశ్వద్ధామ పాత్రలో కనిపించనున్నారు. మహాభారతం లో శ్రీకృష్ణుడి శాపానికి గురై , వేల సంవత్సరాల నుండి కురూపి రూపం లో అశ్వద్ధామ ఈ భూమి మీదనే చిరంజీవి గా జీవిస్తున్నారు.

ఆయన హనుమంతుడికి దైవ కార్యంలో ఎలాంటి సహాయం అందించాడు అనే క్యారెక్టర్ లో రానా ‘జై హనుమాన్’ లో కనిపించబోతున్నట్టు సమాచారం. వేల సంవత్సరాల నుండి కురూపి రూపం లో జీవిస్తున్న అశ్వద్ధామ లుక్స్ ఇలా కాకుండా ఇంకెలా ఉంటుంది. కేవలం పాత్ర కోసమే రానా ఈ విధంగా మారాడని అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ లుక్ పై రానా ఎలాంటి వివరణ ఇస్తారో రాబోయే రోజుల్లో చూడాలి. ఇకపోతే ‘జై హనుమాన్’ విషయానికి వస్తే , 2024 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘హనుమాన్’ చిత్రానికి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్ లో రిషబ్ శెట్టి హనుమంతుడి క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper