Homeఎంటర్టైన్మెంట్`కేజీఎఫ్' టీజర్ డేట్ ఫిక్స్.. యశ్ కి స్పెషల్ ట్రీట్ !

`కేజీఎఫ్’ టీజర్ డేట్ ఫిక్స్.. యశ్ కి స్పెషల్ ట్రీట్ !

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సృష్టించిన సంచలనాల గురించి, నేషనల్ రేంజ్ లో సాధించిన కలెక్షన్స్ గురించి తెలిసిందే. యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఈ సినిమా సీక్వెల్ కూడా ఒకటి. కాగా `కేజీఎఫ్ నిర్మాత కార్తీక్ గౌడ ఈ సినిమా టీజర్ పై స్పష్టత ఇచ్చాడు. ఓ అభిమాని ‘కేజీఎఫ్-2’ టీజర్ గురించి ట్విట్టర్లో నిలదీయగా.. జనవరి 8న యశ్ పుట్టిన […]

KGF 2
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సృష్టించిన సంచలనాల గురించి, నేషనల్ రేంజ్ లో సాధించిన కలెక్షన్స్ గురించి తెలిసిందే. యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఈ సినిమా సీక్వెల్ కూడా ఒకటి. కాగా `కేజీఎఫ్ నిర్మాత కార్తీక్ గౌడ ఈ సినిమా టీజర్ పై స్పష్టత ఇచ్చాడు. ఓ అభిమాని ‘కేజీఎఫ్-2’ టీజర్ గురించి ట్విట్టర్లో నిలదీయగా.. జనవరి 8న యశ్ పుట్టిన రోజు కానుకగా.. టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించాడు. ఈ ఏడాది జనవరి 8న యశ్ పుట్టిన రోజుకే ఆ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు.

Also Read: రజినీకాంత్ ఎన్టీఆర్ రికార్డ్ ను బద్దలుకొట్టగలడా..?

ఇక వచ్చే ఏడాది పుట్టినరోజుకు టీజర్ ను రిలీజ్ చేస్తారు. ఇక ఈ సినిమా మొదటి పార్ట్ బంపర్ హిట్ కావడంతో ఈ సినిమా కోసం అన్ని భాషల ఇండస్ట్రీ ప్రేమికులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. పైగా మాస్ ఆడియెన్స్ అయితే ఈ సినిమా పై పెట్టుకున్న అంచనాలు అన్ని ఇన్ని కావు. ఒక విధంగా ఈ పదేళ్లల్లో ఇలాంటి యాక్షన్ సినిమా రాలేదు అనే చెప్పొచ్చు. కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు గ‌నులు (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా క‌థతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ముఖ్యంగా సినిమాలో మదర్ సెంటిమెంట్ అద్భుతంగా వర్కౌట్ అవ్వడంతో ఈ సినిమా ఓ రేంజ్ లో క్లిక్ అయింది.

Also Read: అభిజిత్ ను ఇంటి నుంచి పంపించేసిన బిగ్ బాస్?

ఇప్పుడు సీక్వెల్ కూడా అలాగే క్లిక్ అయ్యే ఛాన్స్ ఉండటంతో మొత్తానికి ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ గ‌నుల‌పై ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌ దానిని తొలి భాగంలోనే అద్భుతంగా రివీల్ చేశారు. పార్ట్ 2లో ఇంకా భీక‌ర మాఫియాని ప‌తాక స్థాయిలో చూపించ‌బోతున్నారని టాక్. ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిలింస్ సంస్థ మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper