Akka Web Series: సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతున్న కీర్తి సురేష్ , మొట్టమొదటిసారి చేసిన వెబ్ సిరీస్ ‘అక్కా’. ప్రముఖ బాలీవుడ్ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్ , ఈ భారీ బడ్జెట్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా ని తెరెక్కించింది. ఇందులో ప్రముఖ హీరోయిన్ రాధికా ఆప్టే మెయిన్ విలన్ గా నటించింది. ధర్మ రాజ్ శెట్టి ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు. రీసెంట్ గానే ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. విడుదలకు ముందు టీజర్ , ట్రైలర్ వంటివి ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించాయి. మరి ఈ వెబ్ సిరీస్ విడుదల తర్వాత అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుందో లేదో ఒకసారి చూద్దాం.
కథ విషయానికి వస్తే పెర్నూరు అనే ప్రాంతాన్ని వందల ఏళ్ళ నుండి మహిళలే పరిపాలిస్తూ ఉంటారు. స్వతంత్రం వచ్చిన తర్వాత పెర్నూరు కూడా మన భారతదేశంలో విలీనం అయ్యింది. కానీ ఆధిపత్యం మాత్రం మహిళల చేతుల్లోనే ఉండేది. ఆ ప్రాంతం సింహాసనాన్ని అదీష్టించే వాళ్లకు అక్కా అని పిలుస్తుంటారు. పెర్నూరు ప్రాంతాన్ని మూడు భాగాలుగా విభజించగా, అందులో మలేమార్ అనే ప్రాంతానికి కాబోయే రాణీ గా భవానీ అలియాస్ కీర్తి సురేష్ పేరు ని ప్రకటిస్తారు. తన అధికారానికి అడ్డు వచ్చిన వారిని నిర్దాక్షణంగా చెంపేస్తూ ఉంటుంది భవాని. అదే సమయం లో ముంబై నుండి వచ్చిన రుద్రా అలియాస్ రాధికా ఆప్టే భవానీ అదీష్టించిన సింహాసనాన్ని చేదక్కించుకోవడానికి పెర్నూరు లోని వ్యాపారాలన్నీ కూల్చేస్తుంది. చివరికి భావానిని కూడా జైలుకు పంపిస్తుంది. మరి రుద్రా అరాచకాలను అరికట్టి , తన రాజ్యాన్ని భవాని ఎలా తన కంట్రోల్ లోకి తిరిగి తెచ్చుకుంది అనేదే మిగిలిన కథ.
ఇక నటీనటుల విషయానికి వస్తే కీర్తి సురేష్ కి ఇలాంటి పాత్ర చేయడం ఇదే తొలిసారి. లేడీ గ్యాంగ్ స్టర్ పాత్రలో ఆమె నటించలేదు , జీవించింది అనే చెప్పాలి. ఆమె బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ , ఇలా ప్రతీ ఒక్కటి కూడా చాలా కొత్తగా అనిపించాయి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాయి. వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపు మనం కీర్తి సురేష్ ని మర్చిపోతాము, కేవలం భవాని క్యారెక్టర్ ని మాత్రమే చూస్తాము. ఆ స్థాయిలో నటించింది. ఇక కీర్తి సురేష్ ని ఢీ కొట్టే విలన్ క్యారెక్టర్ లో రాధికా ఆప్టే నటన కూడా అద్భుతంగా సెట్ అయ్యింది. ఆమెని చూస్తున్నంతసేపు ఇలాంటి ఆడవాళ్లు కూడా ఉంటారా అని అనుకునే స్థాయిలో కోపం వస్తుంది. ఆ రేంజ్ లో ఆమె విలనిజం పండించింది. ఇక రాధికా ఆప్టే కి జోడిగా నటించిన అన్షుమన్ పుష్కర్ కూడా విలన్ క్యారెక్టర్ లో జీవించాడు.
ఇక వెబ్ సిరీస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే డైరెక్టర్ డైరెక్టర్ ధర్మరాజ్ శెట్టి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు అనే చెప్పాలి. స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు. తాను క్రియేట్ చేసిన పెర్నూరు అనే ఫిక్షనల్ ఊరు గురించి , ఆడియన్స్ సరికొత్త గా ప్రెజెంట్ చేయడం లో ధర్మరాజ్ సక్సెస్ అయ్యాడు. ఆ ఊరి రాజ్యాంగం, అక్కడ పాటించే రూల్స్ చాలా ఆసక్తిగా ఉంటాయి. ఎదో కొత్త తరహా కాన్సెప్ట్ ని మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడని ప్రతీ ఎపిసోడ్ లోనూ అనిపించింది. కానీ మూవీ థీమ్ లోనే మెయిన్ ఎసెన్స్ మాత్రం రొటీన్ గానే అనిపించింది. ఓవరాల్ గా ఒక రొటీన్ రివెంజ్ డ్రామా ని చూస్తున్నట్టుగానే అనిపించింది. ఇలాంటి సిరీస్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండడం తప్పనిసరి , డైరెక్టర్ ఆ విషయం లో సక్సెస్ కాలేదు అనే చెప్పాలి . కానీ టెక్నీకల్ గా మాత్రం ఈ వెబ్ సిరీస్ టాప్ లెవెల్ లో ఉంది. ప్రతీక్ షా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, కలర్ టోన్ చాలా డిఫరెంట్ గా ఉంది.
ఓవరాల్ గా ఇలాంటి రివెంజ్ డ్రామా వెబ్ సిరీస్ లు టాలీవుడ్ , బాలీవుడ్ లకు కొత్తేమి కాదు. కానీ కీర్తి సురేష్ , రాధికా ఆప్టే నటనల కోసం ఈ వెబ్ సిరీస్ ని ఒకసారి కచ్చితంగా చూడొచ్చు. ఈ సిరీస్ కి మా ఓకే తెలుగు ఇస్తున్న రేటింగ్ 2.5/5 ..మరి ఈ వెబ్ సిరీస్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.