Homeఎంటర్టైన్మెంట్Keerthy Suresh: 'ఓటీటీ' లోకి సరికొత్త వెబ్ సిరీస్..క్రూరమైన విలన్ గా కీర్తి సురేష్!

Keerthy Suresh: ‘ఓటీటీ’ లోకి సరికొత్త వెబ్ సిరీస్..క్రూరమైన విలన్ గా కీర్తి సురేష్!

Keerthy Suresh: మన సౌత్ ఇండియా లో అందంతో పాటు అద్భుతంగా నటించగల హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కీర్తి సురేష్ పేరు కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. నేటి తరం యంగ్ హీరోయిన్స్ లో మన సౌత్ నుండి ఉత్తమనటిగా నేషనల్ అవార్డు ని సొంతం చేసుకున్న ఏకైక హీరోయిన్ ఆమె మాత్రమే. అయితే ఇన్ని రోజులు కేవలం వెండితెర కి మాత్రమే పరిమితమైన ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్, ఇప్పుడు బుల్లితెర లో వెబ్ […]

Keerthy Suresh: మన సౌత్ ఇండియా లో అందంతో పాటు అద్భుతంగా నటించగల హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కీర్తి సురేష్ పేరు కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. నేటి తరం యంగ్ హీరోయిన్స్ లో మన సౌత్ నుండి ఉత్తమనటిగా నేషనల్ అవార్డు ని సొంతం చేసుకున్న ఏకైక హీరోయిన్ ఆమె మాత్రమే. అయితే ఇన్ని రోజులు కేవలం వెండితెర కి మాత్రమే పరిమితమైన ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్, ఇప్పుడు బుల్లితెర లో వెబ్ సిరీస్ ద్వారా మన ముందుకు రాబోతుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 30 న ‘అక్కా’ అనే వెబ్ సిరీస్ రాబోతుంది. ఇందులో కీర్తి సురేష్ క్రూరమైన విలన్ పాత్రలో కనిపించబోతుంది. క్రిమినల్ రాజ్యానికి మహారాణి లాగా ఏలుతూ, తనకు అడ్డు వచినవాళ్ళని చంపుతూ ముందుకెళ్లే క్యారెక్టర్ లో ఆమె నటించింది.

ఆమెని ఎదిరించి ఢీ కొట్టే పాత్రలో మరో యంగ్ హీరోయిన్ రాధికా ఆప్టే కనిపించనుంది. రీసెంట్ గానే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ లో కథ గురించి ఎక్కువగా రివీల్ చేయలేదు కానీ , కీర్తి సురేష్ ని మాత్రం చాలా పవర్ ఫుల్ విలన్ గా చూపించారు. ఇన్ని రోజులు హీరోయిన్ గా నటిస్తూ వచ్చిన కీర్తి సురేష్ , మొదటిసారి ఇలా విలన్ క్యారెక్టర్ లో కనిపించడం పై ఆమె అభిమానులు మంచి థ్రిల్లింగ్ ఫీల్ అవుతున్నారు. తెలుగు తో పాటు హిందీ , తమిళం , మలయాళం భాషల్లో కూడా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే కీర్తి సురేష్ కి విలన్ క్యారెక్టర్ చేయడం కొత్తేమి కాదు. బాలనటిగా కెరీర్ గా ప్రారంభించిన ఆమె , పెద్దయ్యాక మలయాళం లో ‘గీతాంజలి’ అనే చిత్రం తో ఆడియన్స్ ని పలకరించింది.

ఇందులో ఆమె డ్యూయల్ రోల్ లో కనిపించగా, ఒక రోల్ పూర్తి స్థాయి నెగెటివ్ గా ఉంటుంది. ఇక ఆ తర్వాత మళ్లీ ఆమె విలన్ క్యారెక్టర్స్ లో కనిపించలేదు. ఇప్పుడు ‘అక్కా’ తో తనలోని క్రూరమైన విలన్ షేడ్స్ ని చూపించబోతుంది. ఒకవేళ ఈ వెబ్ సిరీస్ లో ఆమె అద్భుతంగా నటిస్తే , మరో నేషనల్ అవార్డు కూడా రావొచ్చని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే ప్రస్తుత కీర్తి సురేష్ టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ తో కలిసి ‘రౌడీ జనార్ధన’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు , తమిళం లో కూడా ఆమె రెండు సినిమాల్లో నటిస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper