spot_img
Homeఎంటర్టైన్మెంట్Keerthi Suresh: అల్లు అర్జున్ మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేశ్...

Keerthi Suresh: అల్లు అర్జున్ మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేశ్…

Keerthi Suresh: నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది కీర్తి సురేశ్. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది ఈ భామ. సావిత్రి జీవితకథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ” మహానటి ” సినిమాతో కీర్తి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. మహానటి సినిమాలో కీర్తి నటనతో కట్టిపడేసిందనే చెప్పాలి. అప్పటి నుంచి ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే ఇంకోవైపు తనకంటూ ప్రత్యేకత ఉన్న ఏ క్యారెక్టర్ కి అయినా సై అంటోంది. తెలుగు, తమిళ, మళయాళ భాషలలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది కీర్తి. గత యేడాది కీర్తి సురేశ్ నటించిన ‘పెంగ్విన్, మిస్ ఇండియా’ చిత్రాలు ఓటీటీలో విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ ఏడాది రంగ్ దే తో ప్రేక్షకులను పలకరించగా… త్వరలోనే గుడ్ లక్ సఖి చిత్రంతో రానుంది. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఈ ఇంటరెస్టింగ్ ప్రాజెక్టు కి ఒకే చెప్పినట్టు సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

keerthi suresh going to act with allu arjun under boyapati srinu direction

మెగా ఫ్యామిలిలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసిలో నటించిన కీర్తి… భోళా శంకర్ లో చిరుకి చెల్లెలిగా చేస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా  అల్లు అర్జున్ – బోయపాటి కాంబోలో చేయబోతున్న సినిమాలో కీర్తి సురేష్ ఓకే అయినట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ పార్ట్ 1 చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. డిసెంబర్ లో ఈ చిత్రం విడుదల కానుండగా… వెంటనే పార్ట్ 2ను మొదలు పెట్టకుండా బోయపాటి మూవీ లైన్ లో పెట్టనున్నాడంట అల్లు అర్జున్.

సరైనోడుతో బన్నీకి సూపర్ హిట్ అందించిన బోయపాటి మరోసారి కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు అర్దం అవుతుంది.  గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించబోతున్నారంట. అలానే వచ్చే రెండు మూడు నెలల్లోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుందని తెలుస్తుంది. దీంతో అఫీషియల్ ప్రకటన ఎప్పుడా అని కీర్తి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper