spot_img
Homeఎంటర్టైన్మెంట్karthika Deepam Serial: కానిస్టేబుల్ రత్న సీతతో కలిసి బారి ప్లాన్ చేసిన మోనిత.. షాకైన...

karthika Deepam Serial: కానిస్టేబుల్ రత్న సీతతో కలిసి బారి ప్లాన్ చేసిన మోనిత.. షాకైన కార్తీక్..

Karthika Deepam Serial: Monitha Planned With Constable Ratna Sitakarthika Deepam Serial: బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఎట్టకేలకు మోనిత బ్రతికి ఉందన్న నిజం బయటపడటంతో కార్తీక్ నిర్దోషిగా బయటపడ్డాడు. ఈ క్రమంలోనే కోర్ట్ మోనితను జైలుకు పంపుతుంది. జైల్లో ఉన్నప్పటికీ ఎలాగైనా కార్తీక తన సొంతం చేసుకోవాలని రత్న సీతతో చేతులు కలిపి ఎత్తులు వేస్తుంది మోనిత. ఇక జైలు నుంచి విడుదలైన కార్తీక దీప ఎంతో సంతోషంగా పిల్లలతో కలిసి ఉండటం చూసి ఆనందరావు సంతోషంతో సౌందర్య దగ్గరికి వెళ్లి కొడుకు కోడలు పిల్లల్ని అలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని చెబుతాడు.

ఈ విధంగా అందరూ కలిసి కూర్చుని మాట్లాడుతుంటే పిల్లలని వెళ్లి పడుకోండి అని చెప్పగా సౌర్య మనందరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం అన్నారు కదా డాడీ.. వెళ్దామా అని అడుగుతుంది.. అందుకు దీప ఉదయం మాట్లాడదాము.. వెళ్లి పడుకో అనగా కార్తీక్ వెళ్ళిపోదాం అంటాడు. అదేంటి అని దీప అడగగా అవును అమెరికా వెళ్ళిపోదాం… అనగా అంటే మోనితకి భయపడుతున్నారా అని దీప అడగడంతో భయం కాదు అసహ్యం చిరాకు అంటూ కార్తీక్ అనగా అంతలో సౌందర్య వచ్చే ఎక్కడికి వెళ్తారు అంటే అమెరికా వెళ్ళి పోతా మమ్మీ అంటూ సమాధానం చెబుతాడు.

ఇక దీప మోనిత ఏడుస్తూ తన కడుపులో బిడ్డ అన్యాయంగా చనిపోతుంది అంటూ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుని ఆ విషయాలని వారితో చెబుతుంది. ఆ మాటలు విన్న కార్తిక్ షట్ అప్ దీప అంటూ ఆగ్రహంతో పైకి లేచి ఇంత చేసి ఎవరికీ పరువు మర్యాదలు లేకుండా చేసింది కనీసం మనశ్శాంతి కూడా లేకుండా చేసిన దానిపై నీకెందుకంత జాలి. ఈ ప్రపంచంలో నువ్వే పుణ్యస్త్రీ అని అనుకుంటున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.అప్పుడు సౌందర్య ఏంట్రా ఈ ఆవేశం అని సర్ది చెప్పే ప్రయత్నం చేయగా ఇది ఆవేశమే కేవలం అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

ఇక మోనిత జైల్లో రత్న సీతతో కలిసి భారీ ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోని రత్నం సీత రెండు చేతులు జోడించి మీకు దండం పెడతా నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని అడగగా తనకు సర్దిచెప్పి ఈ పని చేసి పెట్టు అంటూ ఏదో ప్లాన్ చెబుతుంది. కట్ చేస్తే దీపా తులసికోటకు పూజ చేస్తూ తన ఇంటిపై ఏ విధమైనటువంటి చెడు దృష్టి పడకూడదని నమస్కరిస్తున్న సమయంలో రత్న సీత సివిల్ డ్రెస్ లో దీప ఎదురుగా నిలబడుతుంది.డాక్టర్ సార్ ను కలిసి వెళదామని వచ్చాను అని చెప్పడంతో నీకు మేము చాలా రుణపడి ఉంటాం.. మా ఆయన జైల్లో ఉన్నప్పుడు తనకు ఎంతో సహాయం చేసావు అంటూ తనని లోపలికి తీసుకువెళ్తుంది.

ఇక జైల్లో మోనిత ఎలాగైనా కార్తీక్ ను నా సొంతం చేసుకోవాలి. ఇంత అందం, ఐశ్వర్యం ఉన్న నన్ను కాదని ఆ వంటలక్క వెంటపడుతున్నాడు కార్తీక్..కార్తీక్ ఎలాగైనా నాకు కావాలి నా.. కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం అయినా కార్తీక్ పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తుంది. ఇక దీప ఇంటిలోకి వెళ్ళిన రత్నసీత టీ తాగుతూ ఎవరూ లేని సమయంలో అక్కడే దీప ఫోన్ ఉంటే దానిని తీసుకొని మోనిత అంజిని బెదిరిస్తున్న వీడియోని డిలీట్ చేస్తుంది. అంతలోనే అక్కడికి సౌందర్య ఆనంద్ రావు వచ్చి రత్న సీతతో మాట్లాడుతూ ఉండగా కార్తీక అక్కడికి వచ్చి ఏదో బ్యాక్ తీసుకొచ్చినట్లు ఉన్నావు అని అనడంతో నేను తీసుకు రాలేదు నేను ఇటువైపు వస్తున్నానని మోనిత మీకు ఇవ్వమని ఇచ్చిందని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. మరి అందులో ఏముంది అనే విషయం తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. పిడుగులతో కూడిన వానలు పడతాయని...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. విద్యార్థులకు బంపర్ ఆఫర్!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఈనెల 1న ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు....
Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Oktelugu Epaper