Retro : వరుస ఫ్లాప్స్ లో ఉన్న తమిళ హీరో సూర్య(Suriya Sivakumar), తన ఫ్లాప్ ఫామ్ ని కొనసాగిస్తూ రీసెంట్ గా విడుదలైన ‘రెట్రో'(Retro Movie) తో మరో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) తో హీరో సూర్య సినిమా చేస్తున్నాడు అనే ప్రకటన వచ్చినప్పటి నుండే ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు కన్నిమ్మ అనే పాట సెన్సేషనల్ హిట్ అవ్వడం వల్ల ఈ చిత్రం పై అంచనాలు మరింత పెరిగాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ ఓపెనింగ్ వీకెండ్ చాలా డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి. మొదటి వారం మొత్తం డీసెంట్ అని చెప్పొచ్చు. కానీ రెండవ వారం మొదలు అవ్వగానే దారుణంగా పడిపోయింది.
Also Read : రెట్రో’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు..తెలుగు రాష్ట్రాల్లో ఎపిక్ డిజాస్టర్!
ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదలై 18 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 18 రోజులకు గాను ఈ సినిమా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కేవలం తమిళనాడు ప్రాంతం నుండి 50 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని దాటింది. ఫ్లాప్ టాక్ తో వంద కోట్ల గ్రాస్ వసూళ్లు అని చెప్పుకోడానికి బాగుంది, అక్కడితో వదిలేసి ఉంటే బాగుండేది. కానీ మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించి నిన్న వేసిన ఒక పోస్టర్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ పోస్టర్ లో ఈ చిత్రానికి 235 కోట్ల రూపాయిల గ్రాస్ వసూల్లెకు వచ్చినట్టు ఒక పోస్టర్ ని విడుదల చేశారు. సూర్య లాంటి హీరో కూడా ఇలాంటి ఫేక్ ప్రచారాలను ప్రోత్సహిస్తున్నాడా అని నెటిజెన్స్ చాలా ఫీల్ అయ్యారు. కానీ ఈ పోస్టర్ ని జూమ్ ఇన్ చేసి చూస్తే అసలు విషయం అర్థమైంది.
పోస్టర్ కి కుడి వైపు చివర్లో ‘థియేట్రికల్ + నాన్ థియేట్రికల్’ కలిపి ఇంత వసూళ్లు వచ్చాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు చరిత్ర లో ఏ సినిమాకు కూడా ఇలా చెప్పలేదు. సూర్య పై అజిత్, విజయ్ ఫ్యాన్స్ మొదటి నుండి ట్రోల్స్ చేస్తూ ఉండే సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ పోస్టర్ ని వాళ్ళు ఏ రేంజ్ లో ట్రోల్ చేసారో మాటల్లో వర్ణించలేము. నాన్ థియేట్రికల్ అనగానే ‘ఆ చెప్పేయండిరా..థియేటర్స్ లో అమ్ముడుపోయే సమోసాలు, కూల్ డ్రింక్స్ తో వచ్చే డబ్బులతో పాటు పార్కింగ్ కలెక్షన్స్ ని కూడా జత చేసి ఇంకో వంద కోట్లు అదనంగా వేసుకోండి’ అంటూ వెక్కిరిస్తూ ఈ ట్వీట్ వేశారు. అసలు ఇలాంటి పోస్టర్ ని విడుదల చెయ్యాలనే ఆలోచన మేకర్స్ కి ఎలా వచ్చింది అంటూ నెటిజెన్స్ నవ్వుకుంటున్నారు. సూర్య ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉండుంటుందో మీరే ఊహించుకోండి.
Also Read : 59 శాతం రికవరీ..డిజాస్టర్ దిశగా ‘రెట్రో’..13 రోజుల్లో వచ్చింది ఎంతంటే!