
ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీపై సుప్రీంకోర్టు విచారించింది. ఖాళీల భర్తీ విషయంలో కేంద్రం తీరు సంతృప్తిగా లేదని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. ఖాళీల భర్తీకి రెండేళ్ల సమయం తీసుకున్నారు. ఆలస్యానికి చాలా కారణాలు చెబుతున్నారు. మనం ప్రజాస్వామ్యం దేశంలో ఉన్నాం. ప్రభుత్వం నియామకాలు చేపట్టడం ఒక్కటే పరిష్కారం. చాలా ఓపికతో ఉన్నాం. మరికొంత ఓపిక పట్టగలం. నియామకాలు చేపట్టకుంటే తగిన ఆదేశాలిస్తాం అని సీజేఐ చెప్పారు.