Nirupam Paritala Business: కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ పరిటాల సోషల్ మీడియా వేదికగా ఓ సమాచారం పంచుకున్నాడు. ఈ క్రమంలో డాక్టర్ బాబు టాలీవుడ్ స్టార్ హీరోలను ఫాలో అవుతున్నాడంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ నిరుపమ్ తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటో చూద్దాం..
ప్రముఖ రచయిత, నటుడు ఓంకార్ పరిటాల కుమారుడైన నిరుపమ్(NIRUPAM PARITALA) నటుడిగా పరిశ్రమలో అడుగుపెట్టాడు. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ఫిట్టింగ్ మాస్టర్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యాడు. ఈ చిత్రంలో విలన్ రోల్ చేశాడు నిరుపమ్. అనంతరం ఎన్టీఆర్ నటించిన రభస చిత్రంలో ఓ చిన్న పాత్ర చేశాడు. నిరుపమ్ రచయిత కూడా. ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన నెక్స్ట్ నువ్వే చిత్రానికి మాటలు అందించారు. సిల్వర్ స్క్రీన్ పై నిరుపమ్ సక్సెస్ కాలేదు. అయితే బుల్లితెర స్టార్ గా వెలుగొందుతున్నాడు.
Also Read: ‘కింగ్డమ్’ ట్రైలర్ వచ్చేసింది..ఒకపక్క యాక్షన్..మరోపక్క ఎమోషన్!
నిరుపమ్ దాదాపు 16 సీరియల్స్ లో నటించాడు. అయితే కార్తీక దీపం(KARTHEEKA DEEPAM) ఆయనకు స్టార్డం తెచ్చిపెట్టింది. కార్తీక దీపం సీరియల్ ఇండియన్ టెలివిజన్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. కార్తీక దీపం లో కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు పాత్ర చేశాడు నిరుపమ్. ఈ సీరియల్ భారీ సక్సెస్ కావడంతో బుల్లితెర హీరోల్లో నెంబర్ వన్ అయ్యాడు. ఏళ్ల తరబడి కార్తిక దీపం సీరియల్ సాగింది. ఫస్ట్ వెర్షన్ కి ముగింపు పలికి… కార్తీకదీపం నవ వసంతం పేరుతో మరో వెర్షన్ తెచ్చారు. ఇందులో కూడా కార్తీక్, వంటలక్క పాత్రలు ఉన్నాయి. ప్రేమీ విశ్వనాథ్ మరోసారి వంటలక్కగా అలరిస్తుంది.
కార్తీక దీపం 2 సైతం చెప్పుకోదగ్గ ఆదరణ రాబడుతుంది. ఇక సీరియల్ హీరోలలో నిరుపమ్ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటాడని సమాచారం. అతడికి రోజుకు రూ.30 వేలు నిర్మాతలు చెల్లిస్తున్నారట. మరో రెండు సీరియల్స్ లో నటిస్తున్న నిరుపమ్ సంపాదన రోజుకు లక్షకు తగ్గదు అట. అలాగే ఓ సీరియల్ ని ఆయన నిర్మిస్తున్నట్లు సమాచారం. కొన్ని ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నాడు. ఇలా పలు మార్గాల్లో నిరుపమ్ భారీగా ఆర్జిస్తున్నారట.
తన సంపాదనను వ్యాపారంలో పెట్టుబడిగా మారుస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. నిరుపమ్ గార్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడట. ఈ విషయాన్ని నిరుపమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. శ్రీవల్లి కలెక్షన్స్ భాగస్వామిగా చందా నగర్ లో గార్మెంట్ స్టోర్ ప్రారంభిస్తున్నారట. తమకు అభిమానుల బ్లెస్సింగ్స్, ఆదరణ కావాలంటూ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ గార్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నారు. తీరిక లేకుండా సినిమాలు చేస్తూనే పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. నిరుపమ్ కూడా వారిని ఫాలో అవుతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.