Karthika Deepam : తెలుగు బుల్లితెర పై బాహుబలి లాంటి సక్సెస్ ని అందుకున్న సీరియల్ ఏదైనా ఉందా అంటే అది ‘కార్తీక దీపం'(Karthika Deepam) సీరియల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి సీజన్ సుమారుగా ఐదున్నర సంవత్సరాలు టెలికాస్ట్ అయ్యింది. రెండవ సీజన్ గత ఏడాది మార్చి 25 నుండి మొదలై దిగ్విజయంగా నడుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సీరియల్ వచ్చే సమయానికి టీవీ లకు అతుక్కొని పోతుంటారు. ఇక ఈ సీరియల్ ద్వారా వంటలక్క(Vantalakka) క్యారక్టర్ ని మన ఆడియన్స్ ఎంతలా రిసీవ్ చేసుకున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వంటలక్క అంటే మా ఇంట్లో మనిషి అనే విధంగా జనాల్లో పేరు తెచ్చుకుంది. వంటలక్క క్యారక్టర్ ఆ రేంజ్ లో ఎలివేట్ అవ్వడానికి ప్రధాన కారణం, విలన్ క్యారక్టర్ మోనిత అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read : రేపే ‘ఆదిత్య 369’ రీ రిలీజ్..అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే!
వంటలక్క క్యారక్టర్ ని ఆడియన్స్ ఎంతలా అయితే ఇష్టపడతారో మోనిత క్యారక్టర్ ని అంతలా ద్వేషించారు. ఆ క్యారక్టర్ ని శోభా శెట్టి పోషించిన సంగతి అందరికి తెలిసిందే. సీజన్ 2 లో కూడా జ్యోష్న క్యారక్టర్ అలాంటి పవర్ ఫుల్ విలన్ రోల్ అని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే వంటలక్క క్యారక్టర్ చేసిన ఆర్టిస్ట్ పేరు ప్రేమి విశ్వనాథ్. ఈమె కేరళ రాష్ట్రానికి చెందిన అమ్మాయి. ఈ సిరీస్ మొదలయ్యే ముందు ఈమె రోజుకు 25 వేల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకునేది. కానీ ఇప్పుడు మాత్రం ఈమె రోజుకి లక్ష రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటుందట. అంటే నెలకు 12 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ అన్నమాట. భారతదేశంలో ఒక సీరియల్ నటి ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ని అందుకోవడం ఇదే తొలిసారి. అంతే కాదు ఈమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెకు అవసరమయ్యే పనులన్నీ కూడా నిర్మాతనే చూడాలట.
ఫ్లైట్ టికెట్స్, హోటల్ రెంట్స్, ఫుడ్, ట్రావెల్ ఖర్చులు, ఆమె అసిస్టెంట్స్ కి అవసరామయ్యే ఖర్చులు కూడా నిర్మాతనే పెట్టుకోవాలట. అలా ఆమె రెమ్యూనరేషన్ తో పాటు, ఆమె ఖర్చులు కూడా కలిపి రోజుకు రెండు లక్షల రూపాయిలు అవుతుందట. కేవలం ఈమెకు ఒక్కటే ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ఇస్తున్నారంటే, ఈ సీరియల్ లో పని చేసే మిగతా ఆర్టిస్టులకు మొత్తం కలిపి ఎంత ఇస్తున్నారో. ఈ రేంజ్ లో అందరికీ డబ్బులు ఇస్తున్నారంటే ఈ సీరియల్ ద్వారా నిర్మాతకు ఏ రేంజ్ లాభాలు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సీరియల్ స్టార్ మా ఛానల్ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. రోజుకి యావరేజ్ గా 9 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నాయట. ఎన్ని కొత్త సీరియల్స్ పుట్టుకొచ్చినా, ఈ సీరియల్ రేంజ్ ని మాత్రం ఎవ్వరూ మ్యాచ్ చేయలేకపోతున్నారు.