spot_img
Homeఎంటర్టైన్మెంట్Karthika Deepam: ఆధారాలతో కార్తీక్ బాగోతం బయటపెట్టిన మోనిత.. అన్యాయం జరిగిందంటూ ఆవేదన!

Karthika Deepam: ఆధారాలతో కార్తీక్ బాగోతం బయటపెట్టిన మోనిత.. అన్యాయం జరిగిందంటూ ఆవేదన!

Karthika Deepam: బుల్లితెరపై రోజురోజుకు ప్రేక్షకాదరణ దక్కించుకుంది. అత్యధిక రేటింగ్ కైవసం చేసుకొని దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజు ఎన్నో ట్విస్టులతో ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతున్న ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ మరింత ఉత్కంఠ భరితంగా కొనసాగింది. మరి నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే.. డాక్టర్స్ మీటింగుకు మోనిత రాదని తెలిసి కార్తీక్ ఎంతో సంతోషంగా దీపతో కలిసి వెళ్తాడు.అక్కడికి వెళ్ళిన తర్వాత కార్తీక్ కు ఘనంగా స్వాగతం పలుకుతూ ఆయనను ఏకగ్రీవంగా డాక్టర్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేస్తారు. ఇక డాక్టర్ భారతి స్టేజ్ మీదకు వెళ్లి డాక్టర్ కార్తీక్ గురించి ఎంతో గొప్పగా చెబుతుంది. అనంతరం కార్తీక్ గురించి మాట్లాడాలని తన తల్లి సౌందర్యను ఆహ్వానిస్తుంది.

Karthika Deepam
Karthika Deepam

సౌందర్య స్టేజి మీదకు వెళ్లి తన చిన్నప్పటి నుంచి కార్తీక్ మనస్తత్వం తన చేసే అల్లరి గురించి చెబుతూ వస్తోంది. ఇలా కార్తీక్ గురించి మాట్లాడుతూ ఉండడంతో మోనిత ఎంట్రీ ఇచ్చి అందరికన్నా కార్తీక్ గురించి నాకు బాగా తెలుసు అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఇక కార్తీక్ గురించి తన భార్యను మాట్లాడమని చెప్పగా వెంటనే మోనిత స్టేజి మీదకు వెళ్లి సౌందర్యను పక్కకు తప్పుకొమ్మని తను మాట్లాడడానికి ప్రయత్నిస్తోంది. ఆ సమయంలో భారతి ఆపడానికి ప్రయత్నించిన మోనిత కార్తీక్ గురించి మాట్లాడుతుంది.

ఇక మోనిత మాట్లాడుతూ.. కార్తీక్ తన భార్యకు 11 సంవత్సరాలు దూరంగా ఉన్నాడు. దగ్గర లేని భార్య గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడుతుంది. అయినా ఈ డాక్టర్స్ మీటింగుకు డాక్టర్ కాని వాళ్ళని ఎందుకు పిలిచారు ఇక్కడ యాక్టర్స్ కూడా ఉన్నారు అంటూ దీపను ఉద్దేశించి మాట్లాడుతుంది.ఇక డాక్టర్ ప్రెసిడెంట్ గా కార్తీక్ ఎంపిక కావడంతో కంగ్రాట్స్ కార్తీక్ అంటూ మోనిత చెప్పడంతో చిరాకుగా అక్కడి నుంచి కార్తీక్ కి వెళ్తాడు. అయితే దీప ఆనందరావు తనని ఆపుతారు. ఆ సమయంలో మోనిత మాట్లాడుతూ నేను మాట్లాడేది మీరు వినాలి ఆ తర్వాత నువ్వు మాట్లాడని చెప్పగా అయిష్టంగా అక్కడే కూర్చుంటాడు.

Also Read: Akhanda Movie Dialogues, Balayya Babu Akhanda Dialogues

ఇక మోనిత మాట్లాడుతూ నేను కార్తీక్ ను ప్రేమించాను నన్ను పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడు చివరికి పెళ్లి పీటల పైనుంచి తన తల్లి తనని తీసుకువెళ్ళింది. కార్తీక్ పై నాకు ఎంత ప్రేమ ఉందో చెప్పడం కోసం కృత్రిమ గర్భం ధరించి కొడుకును కన్నాను అదిగో నా ఆనందరావు అంటూ తన కొడుకుని చూపిస్తుంది.అదేవిధంగా ఆపరేషన్ టైంలో కార్తీక్ నా భర్తగా సంతకం పెట్టాడు అందుకు ఆధారం ఇదిగో అంటూ జిరాక్స్ పేపర్ చూపిస్తుంది.ఇక బాబు మెడకు పేగు వేసుకుని పుట్టాడు అంటే కార్తీక్ భర్తగా నా పక్కన కూర్చుని శాంతి పూజ చేయించిన ఫోటోలు చూపిస్తుంది. ఇలా నాకు ఎంతో అన్యాయం జరిగింది అంటూ రెండు చేతులు జోడించి మోనిత కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న దీప చప్పట్లు కొట్టడంతో ఒక్కసారిగా మోనిత మొహంలో రంగులు మారిపోతాయి. అసలు దీప ఏం చేయబోతోంది అనేది తర్వాత ఎపిసోడ్ లో తెలియాల్సి ఉంది.

Also Read: దీపను తప్పించే ప్లాన్ లో ఉన్న మోనిత.. చాటుగా తన ప్లాన్ ఏంటో తెలుసుకున్న ప్రియమణి!

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Tammineni Family

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని...
YSRCP

YSRCP: వైసీపీకి ఆ జిల్లాలో భారీ డ్యామేజ్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు...
Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Oktelugu Epaper