Homeఎంటర్టైన్మెంట్Kalki 2898 AD Sequel: 'కల్కి 2' లో అలియా భట్.. మరి సాయి పల్లవి...

Kalki 2898 AD Sequel: ‘కల్కి 2’ లో అలియా భట్.. మరి సాయి పల్లవి సంగతి ఏంటి ? పూర్తి వివరాలు మీకోసం..

Kalki 2898 AD Sequel: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న సీక్వెల్స్ లో అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రం ‘కల్కి 2’. 2024 వ సంవత్సరం లో విడుదలైన ‘కల్కి’ చిత్రం ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ చిత్రం. మహాభారతం కి సైన్స్ […]

Kalki 2898 AD Sequel: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న సీక్వెల్స్ లో అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రం ‘కల్కి 2’. 2024 వ సంవత్సరం లో విడుదలైన ‘కల్కి’ చిత్రం ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ చిత్రం. మహాభారతం కి సైన్స్ ఫిక్షన్ జోడించి , నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరు అమోఘం. అసలు ఇలాంటి ఆలోచన రావడమే అద్భుతం అనుకుంటే, ఆ ఆలోచనకు అద్భుతమైన విజువల్ ప్రెజెంటేషన్ ఇవ్వడం మరో అద్భుతం. అలాంటి వెండితెర అద్భుతానికి రీసెంట్ గానే సీక్వెల్ షూటింగ్ ని మొదలు పెట్టారు. కమల్ హాసన్ , అమితాబ్ బచ్చన్ మరియు ఇతర తారాగణం పై పలు కీలక సన్నివేశాలను రెసిన్ గానే చిత్రీకరించారు.

రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేశారట. సెప్టెంబర్ నుండి పూర్తి స్థాయి షూటింగ్ మొదలు కాబోతుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో ‘sum 30’ పాత్ర నుండి దీపికా పదుకొనే తప్పుకోవడం తో ఆ పాత్రనే సినిమా నుండి తొలగించినట్టు వార్తలు వచ్చాయి. మరికొంత మంది అయితే , ఈ పాత్ర కోసం సాయి పల్లవి ని ఎంచుకున్నారు అంటూ ప్రచారం చేశారు. దీనిపై రీసెంట్ గానే నాగ్ అశ్విన్ స్పందించాడు. ‘sum 30’ పాత్రని తొలగించారు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు , అదే విధంగా ఆ పాత్రని సాయి పల్లవి చేస్తుందంటూ వస్తున్న వార్తల్లో కూడా వాస్తవాలు లేవు, సరైన సమయం వచ్చినప్పుడు , ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటిస్తాము అంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ భాగం అయ్యింది అంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఇందులో ఆమె ‘sum 30’ పాత్ర పోషించలేదని , వేరే కీలక పాత్ర పోషించింది అని , ‘sum 30’ పాత్ర సాయి పల్లవి నే పోషించింది అంటూ ప్రచారం జరిగింది. అయితే లేటెస్ట్ గా నాగ్ అశ్విన్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే , ఈ చిత్రం లో సాయి పల్లవి నటించడంలేదు, ఇప్పుడు అలియా భట్ ఈ చిత్రం లో భాగం అయ్యింది అంటున్నారు , ఆమె పై కొన్ని సన్నివేశాలను కూడా తెరకెక్కించారని అంటున్నారు. దీనిని బట్టీ చూస్తుంటే ‘sum 30’ పాత్రని అలియా భట్ పోషించి ఉంది ఉంటుందని , త్వరలోనే మేకర్స్ ఈ విషయం పై అధికారిక ప్రకటన చేస్తారని అంటున్నారు ఫ్యాన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper