Nag Ashwin: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. గత రెండు సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేసింది. అయితే ఈ సినిమా ఎండింగ్ లో ప్రభాస్ ని కర్ణుడిగా చూపించారు. మొత్తానికైతే అశ్వద్ధామ, కర్ణుడు ఇద్దరు కూడా మంచివారే అన్నట్టుగా ఈ సినిమాలో చూపించడం పట్ల గతంలో కొన్ని వివాదాలైతే తలెత్తాయి. నిజానికి నాగ్ అశ్విన్ ఇలా చూపించడం పట్ల చాలామంది చాలా రకాల విమర్శలు చేశారు. తను చదువుకున్న కొన్ని పుస్తకాల్లో అలా ఉందని దానికి సంబంధించిన కొన్ని విషయాలను నాగ అశ్విన్ చెప్పే ప్రయత్నం చేసిన కూడా ఎవరూ పట్టించుకోలేదు. మొత్తానికైతే ఇప్పుడు ‘కల్కి 2’ సినిమాలో కర్ణుడి పాత్రను హైలైట్ చేసి చూపించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.
కర్ణుడి ముందు అర్జునుడు చాలా తక్కువని చూపిస్తే హిందూ మతాన్ని అలాగే హిందువులు నమ్మే మహాభారతాన్ని తక్కువ చేసి చూపించిన వారవుతారు… కాబట్టి ఈ సినిమా విషయంలో నాగ్ అశ్విన్ చాలా పెద్ద తప్పు చేస్తున్నాడా అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…
ఇక ఏది ఏమైనా కూడా నాగ్ అశ్విన్ మాత్రం ఈ సినిమా మీద ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. నేను ఏదైతే చదివానో దాన్నే స్క్రీన్ మీద ప్రజెంట్ చేయబోతున్నాను అంటూ సమాధానం చెబుతున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలో కర్ణుడు అర్జునుడి కంటే గొప్పవాడు అని చూపించినట్లైతే మాత్రం చాలా వివాదాలకు తావు ఇచ్చిన వాడవువుతాడు.
ఇంకా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. షూటింగ్ కంప్లీట్ అయి సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఎవరెవరు ఈ మూవీ మీద ఎలాంటి విమర్శలు చేస్తారు. మొత్తానికైతే ఈ సినిమా ఎలాంటి కంటెంట్ తో రాబోతుంది ప్రేక్షకులందరిని మెప్పించగలుగుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు. కాబట్టి ఇవి పూర్తయిన వెంటనే ‘కల్కి 2’ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు…
