Homeఎంటర్టైన్మెంట్Kalki Part 2 Heroine: ఒక్క పోస్ట్ తో 'కల్కి 2' హీరోయిన్ ఎవరో చెప్పేసిన...

Kalki Part 2 Heroine: ఒక్క పోస్ట్ తో ‘కల్కి 2’ హీరోయిన్ ఎవరో చెప్పేసిన ప్రభాస్.. ఈ ట్విస్ట్ అసలు ఊహించలేదు..

Kalki Part 2 Heroine: ‘కల్కి 2’ చిత్రం నుండి దీపికా పదుకొనే తప్పుకోవడం , ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నది ఎవ్బరు అనే అంశం పై సోషల్ మీడియాలో చాలా రోజుల నుండి చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు సాయి పల్లవి ని ఖరారు చేసినట్టు వార్తలు వచాయి. కానీ ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రం ‘ఏదైనా మేము అధికారికంగా చెప్పే వరకు నమ్మకండి , త్వరలోనే […]

Kalki Part 2 Heroine: ‘కల్కి 2’ చిత్రం నుండి దీపికా పదుకొనే తప్పుకోవడం , ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నది ఎవ్బరు అనే అంశం పై సోషల్ మీడియాలో చాలా రోజుల నుండి చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు సాయి పల్లవి ని ఖరారు చేసినట్టు వార్తలు వచాయి. కానీ ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రం ‘ఏదైనా మేము అధికారికంగా చెప్పే వరకు నమ్మకండి , త్వరలోనే కల్కి 2 కి సంబంధించిన వివరాలను తెలియజేస్తాము , సెప్టెంబర్ నుండి నాన్ షెడ్యూల్స్ ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో సాయి పల్లవి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతుంది అనే వార్తలకు చెక్ పడింది. ఇక ఆ తర్వాత సోషల్ మీడియా లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు అలియా భట్. బాలీవుడ్ లో ఈమెకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

మన తెలుగు ఆడియన్స్ కి ఈమె #RRR చిత్రం ద్వారా పరిచయమైంది, తెలుగు ఆడియన్స్ లో సోషల్ మీడియా ని ఉపయోగించే యూత్ ఆడియన్స్ కి అలియా భట్ ఎప్పటి నుండో తెలుసు. అయితే ఈమె ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించబోతుందని ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రచారమైన వార్త. మేకర్స్ ఇప్పటికే ఖరారు చేసారని , ఆమెపై పలు సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిందంటూ చెప్పుకొచ్చారు. అయితే దీన్ని చాలా మంది అభిమానులు నమ్మలేదు , కానీ నేడు ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో అలియా భట్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఆల్ఫా’ మూవీ ట్రైలర్ ని అప్లోడ్ చేస్తూ మూవీ టీం కి ఆల్ టైం బెస్ట్ చెప్పారు. జులై 3 న విడుదల అవ్వబోతున్న ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని ఈ సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

సాధారణంగా ప్రభాస్ తన మనసుకి బాగా దగ్గరైన వాళ్ళ సినిమాలు విడుదల అయ్యేటప్పుడు శుభాకాంక్షలు చెప్తుంటారు. లేకపోతే తనతో కలిసి పనిచేయబోయే వాళ్ళ సినిమాలు దగ్గర్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తుంటారు . ప్రభాస్ కి అలియా భట్ తో ఎలాంటి స్నేహం లేదు, కాబట్టి త్వరలో తనతో కలిసి పని చేయబోతున్న హీరోయిన్ కావడంతో , ఆయన ఇలా పోస్ట్ చేసి ఉండొచ్చని , కల్కి 2 లో హీరోయిన్ గా అలియా భట్ నటిస్తుందని ఈ ఒక్క ఘటన తో నిర్థారించుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు. రాబోయే రోజుల్లో వీటిల్లో ఎంత నిజముందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper