Homeఎంటర్టైన్మెంట్Jani Master Chikiri Chikiri: 'చికిరి చికిరి' స్టెప్పులు కంపోజ్ చేసింది జానీ మాస్టర్...

Jani Master Chikiri Chikiri: ‘చికిరి చికిరి’ స్టెప్పులు కంపోజ్ చేసింది జానీ మాస్టర్ కాదా..? అసలు నిజం వీడియోతో సహా బయటకు వచ్చేసింది!

Jani Master Chikiri Chikiri: ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో కానీ, బయట ఫంక్షన్స్ లో కానీ, ఇలా ఎక్కడ చూసినా ‘చికిరి..చికిరి'(Chikiri Chikiri) పాటనే వినిపిస్తోంది. చాలా కాలం తర్వాత ఒక స్టార్ హీరో సినిమాలోని పాటకు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడాన్ని ‘పెద్ది'(Peddi Movie) సినిమాకే చూస్తున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ కి ఇంతకు మించిన కం బ్యాక్ మరొకటి ఉండదు ఏమో. కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు, ఇతర […]

Jani Master Chikiri Chikiri: ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో కానీ, బయట ఫంక్షన్స్ లో కానీ, ఇలా ఎక్కడ చూసినా ‘చికిరి..చికిరి'(Chikiri Chikiri) పాటనే వినిపిస్తోంది. చాలా కాలం తర్వాత ఒక స్టార్ హీరో సినిమాలోని పాటకు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడాన్ని ‘పెద్ది'(Peddi Movie) సినిమాకే చూస్తున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ కి ఇంతకు మించిన కం బ్యాక్ మరొకటి ఉండదు ఏమో. కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు, ఇతర దేశాలకు చెందిన వాళ్ళు కూడా ఈ పాటకు చిందులేస్తున్నారు. వారిలో ప్రముఖులు కూడా ఉండడం విశేషం. ఇన్ స్టాగ్రామ్ లో దాదాపుగా మూడు లక్షల రీల్స్ వచ్చాయి. ఇక యూట్యూబ్ లో అయితే ఏకంగా 10 లక్షల షార్ట్స్ వచ్చాయి. ఈ పాట ఇంత వైరల్ అవ్వడానికి AR రెహమాన్ సంగీతం ఎంత కారణమో, జానీ మాస్టర్(Jani Master) కంపోజ్ చేసిన డ్యాన్స్ స్టెప్పులు కూడా అంతే కారణం.

అయితే రీసెంట్ గానే జానీ మాస్టర్ ఈ పాటకు సంబంధించిన టాప్ సీక్రెట్ ఒకటి బయటకు చెప్పేశాడు. ఇప్పటి వరకు హిస్టరీ లో ఏ కొరియోగ్రాఫర్ కూడా ఇలా చెప్పి ఉండదు. అది జానీ మాస్టర్ గొప్పతనం అనుకోవచ్చు. ఈ పాటలో రామ్ చరణ్(Global Star Ram Charan) బ్యాట్ పట్టుకొని వేసే స్టెప్పుని జానీ మాస్టర్ కంపోజ్ చేయలేదట, రామ్ చరణే కంపోజ్ చేసాడట. నేను క్రింద కూర్చొని వేసే స్టెప్పుని కంపోజ్ చేసాను అంటూ చెప్పుకొచ్చాడు జానీ మాస్టర్. రీసెంట్ గానే జీ తెలుగు ఛానల్ లో మొదలైన ‘ఆట’ అనే డ్యాన్స్ షోకి జానీ మాస్టర్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. ఒక కంటెస్టెంట్ చికిరి పాటకు డ్యాన్స్ వేయగా, వాళ్లకు ఈ పాటకు కంపోజ్ చేసిన అనుభవాన్ని పంచుకుంటూ జానీ మాస్టర్ ఈ కామెంట్స్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

గ్లోబల్ వైడ్ గా అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన హుక్ స్టెప్ ని కంపోజ్ చేసినప్పటికీ కూడా రామ్ చరణ్ గారు ఇది నేనే చేసాను అని చెప్పుకోలేదు, ఆయన చాలా సైలెంట్ గా ఉంటాడు, టోటల్ క్రెడిట్ మాకు ఇస్తారు, ఎందుకంటే నేను కేవలం ఐడియా ఇచ్చాను, అది కచ్చితంగా సక్సెస్ అవ్వుధి అని నమ్మి, దానిని ఇంకా కాస్త ఇంప్రూవ్ చేసి జానాల ముందుకు తీసుకొచ్చింది నువ్వే కాబట్టి, ఆ క్రెడిట్ మొత్తం నీకే దక్కాలి అని అన్నాడట రామ్ చరణ్. అంత పెద్ద హిట్ హుక్ స్టెప్ కి కంపోజ్ చేసినప్పటికీ తన క్రెడిట్ లోకి వేసుకోని రామ్ చరణ్, తనకు ఎక్కడ క్రెడిట్ పోతుందో అనే భయం లేకుండా, ఉన్న వాస్తవాలను బయటపెట్టిన జానీ మాస్టర్, ఇద్దరు కూడా గ్రేట్ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper