Homeబిజినెస్SBI: ఐదేళ్లు 50,000.. ఆ తర్వాత 45 లక్షలు..ఇది మామూలు స్కీమ్ కాదు..

SBI: ఐదేళ్లు 50,000.. ఆ తర్వాత 45 లక్షలు..ఇది మామూలు స్కీమ్ కాదు..

SBI: పిల్లల చదువులు ఒకప్పుడు తల్లిదండ్రులు అనుకున్న బడ్జెట్ కంటే తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని నర్సరీ నుంచి ప్రవేటు బడుల్లో చదివిస్తున్నారు. దీనికోసం భారీగా ఖర్చు పెడుతున్నారు. పిల్లల పై చదువుల విషయంలో కూడా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో బ్యాంకుల్లో లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్లే ఇలాంటివారికి ఎస్బిఐ లైఫ్ ఒక స్కీం తీసుకొచ్చింది. ఈ పథకం పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్.. మ్యారేజ్ వంటి […]

SBI: పిల్లల చదువులు ఒకప్పుడు తల్లిదండ్రులు అనుకున్న బడ్జెట్ కంటే తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని నర్సరీ నుంచి ప్రవేటు బడుల్లో చదివిస్తున్నారు. దీనికోసం భారీగా ఖర్చు పెడుతున్నారు.

పిల్లల పై చదువుల విషయంలో కూడా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో బ్యాంకుల్లో లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్లే ఇలాంటివారికి ఎస్బిఐ లైఫ్ ఒక స్కీం తీసుకొచ్చింది. ఈ పథకం పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్.. మ్యారేజ్ వంటి వాటికి ఉపయోగపడేలా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే దీనిని భవిష్యత్తు నిధి అనుకోవచ్చు. దీనికి ఎస్బిఐ లైఫ్ స్మార్ట్ స్కాలర్ ప్లస్ (SBI Life smart scholar Plus) అని పేరు పెట్టింది.

ఈ పథకం ముఖ్య ఉద్దేశం పిల్లల భవిష్యత్తుకు ఆర్థికంగా భరోసా కల్పించడం.. అంతేకాకుండా మార్కెట్ అనుసంధానంగా రూపొందించడం ద్వారా వచ్చే రాబడులతో వారి కోసం పెద్ద మొత్తంలో నిధులను అందించడానికి ఈ పథకాన్ని ఎస్బిఐ తీసుకొచ్చింది.. ఈ పథకంలో ప్రీమియం ప్లేయర్ వేవర్ బెనిఫిట్ ఉంటుందని ఎస్బిఐ చెబుతోంది. ఇన్సూరెన్స్ కవరేజ్.. మార్కెట్ ఆదరిత పెట్టుబడి రాబడి వంటి వాటిని ఒకే సమయంలో ఇది అందిస్తుంది.. పాలసీ కాలవ్యవధిలో పిల్లల ప్రీమియం చెల్లించే తల్లిదండ్రులు ఒకవేళ చనిపోతే.. లేదా వైకల్యం పొందితే కుటుంబానికి వెంటనే బీమా కవరేజీ వర్తిస్తుంది. ఇక మిగిలిన ప్రేమ మొత్తం ఎస్బిఐ లైఫ్ చెల్లిస్తుంది.

పాలసీ కాలవ్యతి పూర్తయిన తర్వాత నిర్ణీత పిల్లలకు అందుతుంది.. ఈ పథకంలో ఉన్న గొప్ప ప్రయోజనం ఏమిటంటే.. తల్లిదండ్రులు దీర్ఘకాలం కాకుండా కేవలం ఐదు సంవత్సరాల పాటు మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఆప్షన్ కూడా ఉంది.. ఆ తర్వాత ఆ పెట్టుబడిని 15 నుంచి 20 సంవత్సరాల సుదీర్ఘ కాలం ముగిసే వరకు వరకు ఫండ్లలో కొనసాగించవచ్చు. ఈ పథకం అనేది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్.. ఇందులో పాలసీదారుడు చెల్లించే సొమ్ము ఈక్విటీ.. డెట్ ఫండ్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సుదీర్ఘకాలంలో మార్కెట్ సాధించే గ్రోత్ రేట్ ఆధారంగా ఈ ఫండ్ విలువ పెరుగుతూ ఉంటుంది.

ప్రతి ఏడాది రెండు లక్షలు నుంచి 2.5 లక్షలు వరకు దాదాపు 5 సంవత్సరాలలో పాటు జమ చేస్తే 12 నుంచి 15% వార్షిక మార్కెట్ రాబడి లభిస్తుంది. మెచ్యూరిటీ సమయానికి దాదాపు 45 లక్షల వరకు భారీగా నగదు వస్తుంది. ఈ పాలసీలో రిస్క్ పరిమితికి లోబడి పెట్టుబడి పెట్టేందుకు పది రకాల ఫండ్ ఎంపికలను ఎస్బిఐ లైఫ్ తీసుకొచ్చింది. స్కీం లలో ప్రీమియం చెల్లింపుల కోసం సింగిల్ పే.. లిమిటెడ్ పే.. రెగ్యులర్ పై అనే రకరకాల ఆప్షన్లను అందుబాటులో తీసుకొచ్చింది. క్రమం తప్పకుండా లాయల్టి ఆడిషన్స్ అందిస్తూ ఫండ్ విలువను కాలక్రమమైన పెరిగే పాలసీని ఎస్బిఐ తీసుకొచ్చింది. ఒకవేళ పాలసీ ప్రారంభమైన ఐదు సంవత్సరాల తర్వాత.. లాక్ ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత ఆర్థిక అవసరాల కోసం పాక్షికంగా డబ్బులను విత్ డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇందులో కొంతమేర రిస్క్ కూడా ఉంటుంది.

గమనిక..

ఈ కథనం వివిధ వేదికల ద్వారా రూపొందించిన సమాచారం ఆధారంగా అందించాం. దీనిని ఓకే తెలుగు అధికారిక అభిప్రాయం కాదని పాఠకులు గుర్తించాలి. ఈ అంశానికి సంబంధించిన కచ్చితత్వం.. సమగ్రత.. వంటి వాటిల్లో ఎటువంటి హామీ ఇవ్వడం లేదు. దీనికి సంబంధించిన బాధ్యత మాది కూడా కాదు. పెట్టుబడి పెట్టే విషయంలో మేము ఎటువంటి సలహా ఇవ్వడం లేదు. అలాగే సెక్యూరిటీల కొనుగోలు లేదా అమ్మకాలు విషయంలో కూడా ప్రోత్సహించడం లేదు. కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాం.. ఒకవేళ మీరు ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ముందుగా లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సూచనలు తీసుకోండి. ఈ కంటెంట్ ను కేవలం ఇన్ఫర్మేషన్ మోడ్లో మాత్రమే మీరు చూడండి

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper