Irumudi Movie Twitter Talk: మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఇరుముడి’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. వరుసగా 6 డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత వచ్చినప్పటికీ కూడా , ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో జరిగాయి. రవితేజ మంచి సినిమా చేస్తే ఆడియన్స్ ఆయన సినిమాలను చూసేందుకు ఏ రేంజ్ లో ఎగబడుతారో అని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. విడుదలకు ముందు పాటలు , టీజర్, ట్రైలర్ , ఇలా ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ పేలడంతో, ఈ చిత్రానికి జనాల్లో ఇంతటి క్రేజ్ ఏర్పడింది. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ వచ్చింది?, అందరి కంటే ముందు ఈ సినిమాని చూసిన ఓవర్సీస్ ఆడియన్స్ నుండి ట్విటర్ లో ఏమనుకుంటున్నారు అనేది వివరంగా ఇప్పుడు మనం చూడబోతున్నాము.
#Irumudi Satisfactory Slow-Burn Emotional Thriller That Has Its Share of Writing Flaws but Is Hard-Hitting and Sincere Enough!
First half is on the slow side but stays engaging and builds a neat emotional connect through the father-daughter bond. Second half works in parts. It…
— Venky Reviews (@venkyreviews) August 21, 2026
ట్విటర్ నుండి వినిపిస్తున్న ఒకే ఒక్క మాట ఏంటంటే , ఇన్ని రోజులు రవితేజ ని మాస్ మహారాజ అని పిలిచాము , ఈ చిత్రం తో ఎమోషనల్ మహారాజ అని పిలుస్తాము అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కాస్త స్లో గానే ఉంటుంది కానీ , చాలా ఎంగేజింగ్ గా ఉంటుందని, కొన్ని సన్నివేశాలకు థియేటర్స్ లో ఆడియన్స్ ఈలలు వేసేలా ఉందని , ఒక ఆసక్తికరమైన సెకండ్ హాఫ్ కి స్టేజి ని ఫిక్స్ చేసారని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని , ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ వెండితెర పై అద్భుతంగా వర్కౌట్ అయ్యిందని అంటున్నారు. ముఖ్యంగా తండ్రి , కూతురు మధ్య ఎమోషన్ ని చాలా అద్భుతంగా చూపించారట. క్లైమాక్స్ అయితే ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించేలా ఉందని అంటున్నారు.
Terrific act by raviteja. Almost after a decade ankuta. Above average first half and a bl second half.. little girl portions are so good..twists in the second half are good. Blockbuster potential unde but koni scenes inka masth teeyoch emo… emotional hit. 3.25/5#Irumudi
— Tony (@tonygaaaadu) August 21, 2026
రవితేజ నుండి ఇలాంటి జానర్ సినిమాలు అసలు ఊహించలేదని, ఒక పూర్తి స్థాయి డిఫెరెంట్ రవితేజ ని వెండితెర మీద చూసినట్టు ఉందని, పెర్ఫార్మన్స్ పరంగా గత దశాబ్ద కాలం లో రవితేజ కి ఇదే బెస్ట్ అని అంటున్నారు. ఇక జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం వేరే లెవెల్ లో లేదు కానీ , మంచి మ్యూజిక్ ని అందించారని అంటున్నారు. కానీ కొన్ని సన్నివేశాలను ఇంకా బాగా తీయొచ్చు అంట. వాటిని ఎందుకో ఫాస్ట్ గా చుట్టేసినట్టు అనిపించిందని కొందరు అంటున్నారు. ఓవరాల్ గా చాలా కాలం తర్వాత రవితేజ నుండి వచ్చిన మంచి సినిమా , దీనికి జనాలు ఎలాంటి ఫలితం ఇస్తారో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ట్విటర్ రివ్యూస్ మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
just finished #Irumudi. . super hitttuuu.. super first half, mallepoola pallaki song peaks, engaging screenplay throughout with emotional climax.. ravanna performance chimpi egaresthe, paper lu kanapadatle… congratulations @RaviTeja_offl anna
— movie buff (@newMovieBuff007) August 21, 2026
First off chala baagundi vintage @RaviTeja_offl anna is back#Irumudi
— NΛNI (@UrsCultMB_fan) August 21, 2026
Mallepoola pallaki song
Followed by chase
Theatre erupted
Swamiye saranam ayyappa #Irumudi— AlwaysCharanist (@avndec31) August 21, 2026