Homeఆధ్యాత్మికంAshta Lakshmi Forms : మహాలక్ష్మి అమ్మవారికి ఎన్ని రూపాలు?

Ashta Lakshmi Forms : మహాలక్ష్మి అమ్మవారికి ఎన్ని రూపాలు?

Ashta Lakshmi Forms : శ్రావణమాసంలో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా కొలుస్తారు. ఎందుకంటే అమ్మవారి జననం, వివాహం ఈ నెలలో జరిగిందని పురాణాలను బట్టి తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని కొలుస్తూ ప్రతి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. అయితే మహాలక్ష్మి అమ్మవారు ఎన్ని రూపాల్లో కనిపిస్తారు? ఎలాంటి వరాలు ఇస్తారు? అన్న ఆసక్తి చాలా మందికి ఉంటుంది. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం మహాలక్ష్మి అమ్మవారు ఎన్ని […]

Ashta Lakshmi Forms : శ్రావణమాసంలో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా కొలుస్తారు. ఎందుకంటే అమ్మవారి జననం, వివాహం ఈ నెలలో జరిగిందని పురాణాలను బట్టి తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని కొలుస్తూ ప్రతి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. అయితే మహాలక్ష్మి అమ్మవారు ఎన్ని రూపాల్లో కనిపిస్తారు? ఎలాంటి వరాలు ఇస్తారు? అన్న ఆసక్తి చాలా మందికి ఉంటుంది. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం మహాలక్ష్మి అమ్మవారు ఎన్ని రూపాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆదిలక్ష్మి:
లక్ష్మీదేవిని ఆదిలక్ష్మి రూపంలో కనిపిస్తుంది. భక్తులకు ఆధ్యాత్మిక బలం, మనశ్శాంతి, సంతృప్తిని ప్రసాదించే తల్లిగా ఈ రూపంలో దర్శనమిస్తారు. జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగేలా అనుగ్రహం ప్రసాదిస్తారు.

ధనలక్ష్మి:
పెరుగు తగ్గట్లుగానే ధనలక్ష్మి భక్తులకు సిరిసంపదలను అందిస్తుంది. కష్టాల్లో ఉన్నవారికి అవసరమైన ఆదాయాన్ని అందిస్తూ వారి జీవితాన్ని సుఖమయం చేస్తుంది. ధన సంపదలతో పాటు సత్ప్రవర్తన కలిగేలా కూడా ఈమాత భక్తులకు వరాలు ఇస్తుంది.

ధాన్యలక్ష్మి:
జీవితానికి ఆహారం అత్యంత అవసరం. అయితే ఇది కొరత ఉన్నవారు అమ్మవారిని కలవడం వల్ల ఇంట్లో ఆహారానికి కొరత లేకుండా చేస్తుంది. రైతులు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ధనలక్ష్మికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఆహారాన్ని వృధా చేసే వారిపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తుందని భక్తులు నమ్ముతారు.

గజలక్ష్మి:
ఏనుగుల మధ్య ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని గజలక్ష్మిగా పేర్కొంటారు. ఐశ్వర్యంతో పాటు రాజసం, శక్తికి ప్రత్యేకంగా గజలక్ష్మిని కొలుస్తారు. ఈ అమ్మవారిని కలవడం వల్ల భక్తులు సౌభాగ్యాన్ని పొందుతారని భావిస్తారు.

సంతాన లక్ష్మి:
సంతానం కోరుకునేవారు సంతాన లక్ష్మి కొనడం వల్ల అనుకున్న వరాలు పొందుతారని భక్తులు నమ్ముతారు. సంతానం కేవలం వంశాభివృద్ధి మాత్రమే కాకుండా కుటుంబ ఆనందానికి కూడా ప్రత్యేకంగా చెబుతారు.

ధైర్యలక్ష్మి:
కష్టాల్లో ఉన్నవారు ధైర్యంగా ఉండేందుకు ఈ అమ్మవారిని కొలవడం వల్ల ధైర్య సాహసాలు ప్రసాదిస్తారని నమ్ముతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లేందుకు ధైర్యలక్ష్మి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు.

విజయలక్ష్మి:
పోటీ పరీక్షలు, విద్య, వ్యాపారాల్లో విజయం సాధించేందుకు విజయలక్ష్మి అనుగ్రహం ఉంటే కచ్చితంగా సాధిస్తారని కొందరు భక్తులు నమ్ముతారు. శుభకార్యాలు ప్రారంభించేటప్పుడు సైతం విజయలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తారు.

ఐశ్వర్య లక్ష్మి:
సంపూర్ణ సౌభాగ్యం, కుటుంబ అభివృద్ధి, సమాజంలో గౌరవం, సంతృప్తి అన్నీ కలిగేందుకు ఐశ్వర్య లక్ష్మిని పూజించాలని భక్తులు. ఈ అమ్మవారిని కొలవడం వల్ల జీవితంలో సుఖశాంతులతో పాటు విజయాలు చేకూరుతాయని చెబుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper