Homeఎంటర్టైన్మెంట్Irumudi Movie Review: ఇరుముడి రివ్యూ... ట్రాక్ లోకి వచ్చిన మాస్ మహారాజా

Irumudi Movie Review: ఇరుముడి రివ్యూ… ట్రాక్ లోకి వచ్చిన మాస్ మహారాజా

Irumudi Movie Review: నటీనటులు: రవితేజ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, సాయికుమార్, రమేష్ ఇందిర, అజయ్ ఘోష్ తదితరులు సంగీత దర్శకుడు: జి.వి. ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ ఎడిటర్: ప్రవీణ్ పూడి దర్శకత్వం: శివ నిర్వాణ నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్ మాస్ మహారాజా ఈమధ్య మూస సినిమాల మహారాజాలాగా మారిన సంగతి తెలిసిందే. దాన్ని బ్రేక్ చేస్తూ ఒక ఇంటెన్స్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను ఎంచుకున్నాడని ఇరుముడి పాటలు, ట్రైలర్ […]

Irumudi Movie Review: నటీనటులు: రవితేజ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, సాయికుమార్, రమేష్ ఇందిర, అజయ్ ఘోష్ తదితరులు

సంగీత దర్శకుడు: జి.వి. ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ

ఎడిటర్: ప్రవీణ్ పూడి

దర్శకత్వం: శివ నిర్వాణ

నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్

మాస్ మహారాజా ఈమధ్య మూస సినిమాల మహారాజాలాగా మారిన సంగతి తెలిసిందే. దాన్ని బ్రేక్ చేస్తూ ఒక ఇంటెన్స్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను ఎంచుకున్నాడని ఇరుముడి పాటలు, ట్రైలర్ తో అందరికీ అర్థం అయింది. రవితేజ గెటప్ కూడా ఎంతో సహజంగా ఉండడం, డివోషనల్ టచ్ ఉన్న టైటిల్ ‘ఇరుముడి’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. తెలుగు వారిలో అయ్యప్ప భక్తులు, శబరిమల యాత్రకు వెళ్ళేవారు ఎక్కువే కావడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. అయ్యప్ప దీక్ష నేపథ్యం, ఫాదర్-డాటర్ సెంటిమెంట్, క్రైమ్ కోణం.. ఇవన్నీ కలగలిపి శివ నిర్వాణ తెరకెక్కించిన ఇరుముడి ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

కథ:

త్రినాథ్ (రవితేజ) తన భార్య కావేరి (ప్రియా భవానీ శంకర్), కూతురు మణికంఠ (బేబీ నక్షత్ర)తో కలిసి అల్లూరి సీతారామారాజు జిల్లాలోని ఒక పల్లెటూరిలో ఉంటాడు. రవితేజకు కూతురంటే ప్రాణం. త్రినాథ్ మంచివాడే కానీ అయ్యప్పస్వామి దీక్ష సమయంలో తప్ప మిగతా అన్నీ రోజులు చుక్కేయందే పూట గడవదు. ఇక ఎవరైనా ఊర్లో అమ్మాయిలను ఏడిపించినా, వేధించినా వారిని తుక్కురేగ్గొడుతూ గొడవలు పడుతుంటాడు. ఇలా ఉంటే ఆ ఊర్లో జరిగే కొన్ని సంఘటనలు, అనుమానాస్పద మరణాలు త్రినాథ్ జీవితాన్ని కొన్ని మలుపులు తిప్పుతాయి. ముఖ్యంగా అయ్యప్ప దీక్షలో ఉన్న సమయంలో త్రినాథ్ గురువులా భావించే గురుస్వామి గోపరాజు(సాయి కుమార్)కూతురు రాత్రంతా ఇంటికి రాకపోవడంతో మొదలైన చిక్కుముడి చివరికి ఎలాంటి మలుపు తీసుకుంది? దీని వెనక ఎవరున్నారు? అనేది మిగతా కథ.

దర్శకుడు శివ నిర్వాణ గత సినిమాను గమనిస్తే వాటిలో ఉన్న ప్రధాన బలం ఎమోషన్స్. ఈ సినిమాలో కూడా ఆ ఎమోషన్స్ పండించడంలో విజయం సాధించాడు. క్రైమ్ ఎలిమెంట్ ప్రధానంగా సినిమా కథను నడిపిస్తుంది. కొన్ని లాజిక్స్ ను వదిలేయడం.. అసలు పోలీసులు అంటూ లేకపోవడం, సీన్లోకి రాకపోవడం మరీ కన్వీనియంట్ రైటింగ్ అని చెప్పకతప్పదు. అలా ఉన్నప్పటికీ ఒకవైపు అయ్యప్పస్వామి డివోషనల్ వైబ్.. నాన్న – కూతురు ఎమోషన్ ఆ లోపాలను మరుగున పడేలా చేస్తుంది. సినిమాలో డైలాగ్స్ కూడా బాగున్నాయి. “నాకో వీక్ నెస్ ఉంది. ఏ ఆడపిల్లైనా నాకు కూతురిలాగే కనిపిస్తుంది” లాంటివి హీరోయిజంను ఫుల్లుగా ఎలివేట్ చేశాయి. ఫస్ట్ హాఫ్ క్రైమ్ ఎలిమెంట్ ఉన్నప్పటికీ, కాస్త కామెడీ.. కాస్త డివోషన్.. అన్నట్టుగా సాగుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఇంటెన్స్ గా మారుతుంది. కొన్ని చోట్ల ఫోర్స్డ్ గా అనిపించే సీన్స్ కూడా ఉన్నాయి.

త్రినాథ్ పాత్రలో రవితేజ అద్భుతంగా నటించాడు. రవితేజ కెరీర్ లో బెస్ట్ పర్ఫామెన్సెస్ లో ఇదొకటి. బేబీ నక్షత్ర కూడా చక్కగా నటించింది. ఈ సినిమాలో రవితేజ- బేబీ నక్షత్ర సీన్లు సినిమాకే హైలైట్. కావేరి పాత్రలో ప్రియభవానీ శంకర్ నటన డీసెంట్ గా ఉంది. ఇక సాయికుమార్, అజయ్ ఘోష్, రమేశ్ ఇందిర తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.

జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని ఇంటెన్సిటీని మరింత పెంచింది. అయ్యప్ప స్వామి టచ్ ఉన్న పాటలు బాగున్నాయి. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలు, నైట్ సీక్వెన్సులు చాలా సహజంగా ఉన్నాయి.

సినిమా బాగుందా బాగాలేదా అని చెప్పాలంటే ఎమోషనల్ గా ఉంది. సెంటిమెంటల్ గా ఉంది! ఇలాంటి ఎలిమెంట్స్ నచ్చేవారికి బాగా నచ్చుతుంది. అలా కాకుండా థ్రిల్లర్ ఎలిమెంట్స్ లో లాజిక్స్ వెతుకుతూ షెర్లాక్ హోమ్స్ తరహాలో చూసేవారికి జస్ట్ యావరేజ్ అనిపిస్తుంది. ఇక అయ్యప్ప స్వామి వైబ్ అయితే అదిరిపోయింది. ముఖ్యంగా “మల్లెపూల పల్లకీ” పాట టైములో థియేటర్ అంతా ఊగిపోయింది.

సినిమాలో ఏం బాగున్నాయో తెలుసా?

1. రవితేజ నటన, గెటప్ & తండ్రీ-కూతుళ్ల ఎమోషన్
2. అయ్యప్ప దీక్ష నేపథ్యం
3. నేపథ్య సంగీతం & సినిమాటోగ్రఫీ

సినిమాలో బాగలేనివి ఇవి:

1. రొటీన్ విలన్ ట్రాక్
2. పోలీసులు అసలు లేకుండా లాజిక్ లను వదిలేసిన రైటింగ్
2. సెకండ్ హాఫ్ లో కొంత వీక్ అయిన సస్పెన్స్

రేటింగ్: 2.75/5

ఫైనల్ వర్డ్: చాలారోజుల తర్వాత కనిపించిన ఒరిజినల్ రవితేజ

 

 

Ramu Kovuru
Ramu Kovuruhttps://oktelugu.com/
Ramu Kovuru is a writer having 10 plus years of experience. He has worked for websites writing movies content. He is also woriking in Telugu film industry as a writer for the past 5 years. He has good knowledge in cinema across the languages. He contributes to movie reviews.

Related News

Most Popular

Oktelugu Epaper