Allu Arjun: సినిమా ఇండస్ట్రీ అనగానే చాలామంది నటీనటులు వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకోవడానికి చాలా వరకు కష్టపడుతూ ఉంటారు. స్టార్ హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే చిన్న చిన్న ఆర్టిస్టులు మాత్రం వాళ్ళకంటూ ఒక క్రేజ్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తుంటారు. ఒక మంచి క్యారెక్టర్ పడితే వల్ల జీవితం మారిపోతుందనే దృక్పథంతో ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే శ్రావణ సంధ్య అనే ఒక నటీమణి ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తమ్సప్ ఆడ షూటింగ్ లో పాల్గొన్నప్పుడు అల్లు అర్జున్ తనని చూసి తనతో మాట్లాడారట. ఇక ఆమె తన గురించి తాను చెబుతూ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ‘గమ్యం’ సినిమాలో తను నక్సలైట్ గా నటించానని కూడా చెప్పిందట.
దాంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ షాక్ అయ్యాడట. గమ్యం సినిమాలో చివర్లో నక్సలైట్ గా కనిపించేది మీరేనా అని అడిగాడట. దాంతో ఆమె కూడా అవునని చెప్పిందట. ఆ సినిమా చూసినప్పుడు ఓయమ్మ ఇదెవ్వతి ఇలా ఉంది. అచ్చం నక్సలైట్ లాగానే ఉంది అని అనుకున్నాను అంటూ ఆమెతో చెప్పారట. మొత్తానికైతే ఆమె అల్లు అర్జున్ తన క్యారెక్టర్ ని గుర్తించినందుకు చాలా సంతోషపడుతుంది.
తను చాలా సినిమాల్లో నటించానని డాన్సర్ గా కూడా చేశానని జూనియర్ ఆర్టిస్ట్ గా మాత్రం ఎప్పుడు చేయలేదని మోడల్ గానే నటించాలనని చెప్పింది. ఇక ప్రస్తుతం కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశం వస్తే నటించానని చెప్పింది.
ఫ్యూచర్లో మరిన్ని మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోవాలనేదే తన కోరికగా చెప్పింది… ప్రస్తుతం ఈమె కొన్ని చిన్న సినిమాల్లో నటిస్తుంది. అలాగే బాలయ్య బాబు, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించబోతుందట…