Homeఎంటర్టైన్మెంట్Shruti Haasan : కరోనా వల్ల లాభపడిన శృతి హాసన్ !

Shruti Haasan : కరోనా వల్ల లాభపడిన శృతి హాసన్ !

Shruti Haasan: శృతి హాసన్ (Shruti Haasan) అంటేనే బోల్డ్. ఆమె వ్యవహారం ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. విశ్వ న‌టుడు క‌మ‌ల్‌ హాస‌న్ కుమార్తెగా సినిమాల్లోకి వచ్చినా.. తనది ప్రత్యేక శైలి అంటూ ముందుకు సాగింది. వయసు పై బడినా పెళ్లి చేసుకోకుండా ప్రేమలో జీవితాన్ని గడిపేస్తోంది. ఏది ఏమైనా శృతి హాసన్ కి పెద్దగా కష్టపడకుండానే స్టార్ డమ్ వచ్చింది. అయితే ఒక హీరోయిన్ గా గ్లామర్ ప్రపంచంలో ఎలాంటి హద్దులు లేకుండా ఎంత కష్టపడాలో.. […]

Shruti HaasanShruti Haasan: శృతి హాసన్ (Shruti Haasan) అంటేనే బోల్డ్. ఆమె వ్యవహారం ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. విశ్వ న‌టుడు క‌మ‌ల్‌ హాస‌న్ కుమార్తెగా సినిమాల్లోకి వచ్చినా.. తనది ప్రత్యేక శైలి అంటూ ముందుకు సాగింది. వయసు పై బడినా పెళ్లి చేసుకోకుండా ప్రేమలో జీవితాన్ని గడిపేస్తోంది. ఏది ఏమైనా శృతి హాసన్ కి పెద్దగా కష్టపడకుండానే స్టార్ డమ్ వచ్చింది.

అయితే ఒక హీరోయిన్ గా గ్లామర్ ప్రపంచంలో ఎలాంటి హద్దులు లేకుండా ఎంత కష్టపడాలో.. శృతి హాసన్ అంతకంటే ఎక్కువ కష్టపడింది. మొత్తానికి ఎలాగోలా స్టార్ హీరోయిన్ గా నిలబడింది. అయితే, హీరోయిన్స్ లో ఈ కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత హిట్లు అందుకున్న హీరోయిన్ శృతి హాసనే. శృతి హాసన్ కు, కరోనాకి ముందు ఫ్లాప్స్ ఉన్నాయి. పైగా సినిమాలకు కూడా చాలా గ్యాప్ వచ్చింది.

ప్రేమలో విఫలం అయ్యాక మద్యానికి అలవాటు పడి, మళ్ళీ ఆ మత్తు నుండి బయట పడటానికి శృతి చాలా టైం తీసుకుంది. ఈ లోపు ఆమె ప్లేస్ లో కొత్త హీరోయిన్లు వచ్చేశారు. ఇక శృతి హాసన్ కి ఛాన్స్ ల రావడం దాదాపు కష్టమే అనుకుంటున్న సమయంలో కరోనా మొదటి సంక్షోభం వచ్చింది.

దాంతో సినిమాల రాక మారింది, అలాగే నటీనటులు ఎంపికలో కూడా అనేక మార్పులు వచ్చాయి. ఈ క్రమంలో శృతి హాసన్ కి క్రాక్ సినిమా తగిలింది. కట్ చేస్తే.. ఆ సినిమా రిలీజ్ అయి పెద్ద విజయం సాధించింది. ఇక క్రాక్ తర్వాత శృతి హాసన్ హీరోయిన్ గా వచ్చిన మరో సినిమా పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’. ఈ సినిమా కూడా బాగానే ఆడింది.

అంటే.. కరోనా తర్వాత వరుసగా రెండు విజయాలు అందుకున్న ఏకైక హీరోయిన్ శృతి హాసనే. మొత్తమ్మీద కరోనా సమయంలో లాభపడింది శృతి హాసన్ ఒక్కటే. ఇక ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ ‘సలార్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ సినిమా హిట్ అయితే.. పాన్ ఇండియా రేంజ్ లో శృతి హాసన్ కెరీర్ మళ్ళీ ట్రాక్ లో పడుతుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper