
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇండియాకు బ్రేక్ దొరికింది. ఇంగ్లాండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ ఔటయ్యాడు. షమీ బౌలింగ్ లో అతను క్లీన్ బౌల్డయ్యాడు. బర్న్స్ 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరాడు. 120 స్కోర్ వద్ద రెండో రోజు ఇన్నింగ్ ను ఆరంభించిన ఇంగ్లాండ్ మరో 15 పరుగులు జోడించి బర్న్స్ వికెట్ ను కోల్పోయింది. హామీద్ 67 రన్స్ తో క్రీజులో ఉన్నాడు. ఇండియా తన తొలి ఇన్నింగ్స్ లో 78 రన్స్ కే ఆలౌటైన విషయం తెలిసిందే.