Rajamouli Mahesh Babu Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఆయన మహేష్ బాబు సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు… మరి ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం హాలీవుడ్ లోని ‘ఇండియానా జోన్స్’ సినిమాలోని కొన్ని సీన్స్ ని కాపీ చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా రాజమౌళి మాత్రం మంచి కాన్సెప్ట్ తో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న మొదటి పాన్ వరల్డ్ సినిమా కోసం హాలీవుడ్ సినిమాలోని సీన్స్ ని కాపీ చేస్తున్నాడు అనే వార్తల మీద ఆయన ఎలాంటి స్పందన తెలియజేయడం లేదు.
Also Read: తండ్రి కారణంగా రోడ్డు మీదకు వచ్చిన హీరో నాని ఫ్యామిలీ..మరీ ఇంత దారుణమా!
ఇక మరి కొంతమంది రాజమౌళి అభిమానులు మాత్రం ఆయన ఎలాంటి సీన్ ను కాపీ చేయడు. తన ఒరిజినాలిటికి దగ్గరగా ఉండే సన్నివేశాలను చేస్తూ ఉంటాడు. అలాగే ఒక సినిమా నుంచి ఏదైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్న కూడా దాన్ని ప్రేక్షకులకు నచ్చే విధంగా మార్పులు చేర్పులు చేసి సినిమాలో వాడతారు.
అది ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని, తద్వారా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడని ప్రతి ఒక్కరు తెలియజేస్తూ ఉండటం విశేషం…ఇక ఇప్పటివరకు ఆయన కెరియర్ లోనే ఫ్లాప్ సినిమా అనేది లేదు. కాబట్టి ఈ సినిమాని సైతం సక్సెస్ చేయాలని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నాడు.
మరి కాపీ సీన్స్ మీద ఆయన స్పందిస్తే గాని దీని మీద ఒక క్లారిటీ అయితే రాదు. ఆ సినిమా రిలీజ్ అయితే గాని ఆ మూవీలో ఎన్ని కాపీ సీన్స్ ఉన్నాయనేది తెలియదు. కాబట్టి ఇప్పుడప్పుడే మనం అతను హాలీవుడ్ సినిమాలోని సీన్స్ ని కాపీ చేస్తున్నాడు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అంటూ మరికొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తుండటం విశేషం…