Jayammu Nischayammu Raa With Jagapathi: గత కొద్దిరోజుల క్రితమే జీ తెలుగు ఛానల్ లో జగపతి బాబు(Jagapathi Babu) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా'(Jayammu Nischayammu Raa) అనే ప్రోగ్రాం మొదలై అద్భుతమైన రెస్పాన్స్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. మొదటి ఎపిసోడ్ కి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేయగా, రెండవ ఎపిసోడ్ కి శ్రీలీల వచ్చింది. ఈ రెండు ఎపిసోడ్స్ కి అద్భుతమైన రేటింగ్స్ వచ్చాయి. ఇక మూడవ ఎపిసోడ్ ని కాసేపటి క్రితమే జీ5 యాప్ లో అప్లోడ్ చేశారు. ఈ ఎపిసోడ్ కి నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) ముఖ్య అతిథిగా విచ్చేశాడు. జగపతి బాబు కి ఆయన ముందు నుండే బాగా పరిచయం ఉండడం తో చాలా సరదాగా సాగిపోయింది ఈ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ ద్వారా నాని గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం.
Also Read: రాజస్థాన్ రాయల్స్ నుంచి ద్రావిడ్ ఎందుకు తప్పుకున్నారు? కారణం అదేనా?
నాని మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన అబ్బాయి అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఆయన అసలు పేరు గంటా నవీన్ బాబు. ఆయన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి జగపతి బాబు అడగ్గా, నాని చెప్పిన మాటలను చూస్తే ఆయన తల్లికి సెల్యూట్ చేయకుండా ఉండలేము. ఆయన మాట్లాడుతూ ‘మా నాన్న పేరు రాంబాబు. అప్పట్లో ఆయన గోదావరి ఫెర్టిలైజర్స్ అనే కంపెనీ లో పని చేసేవాడు. కొంతకాలం తర్వాత ఆయన ఆ ఉద్యోగం మానేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసాడు. కానీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉండేది. అలాంటి సమయం లో మా అమ్మ ఇంటికి ఒక బ్యాక్ బోన్ లాగా నిల్చింది. ఆమె సెంట్రల్ గవర్నమెంట్ ఆద్వర్యం లో నడుస్తున్న CGHS లో ఫార్మసిస్ట్. ఆమె ఉద్యోగం కారణంగా మా నాన్న వ్యాపారాలు ఫెయిల్ అయినప్పుడు ఇల్లు గడవడానికి ఆమె కారణం అయ్యింది’.
‘మా నాన్న మనుషులను చాలా గుడ్డిగా నమ్మేసేవాడు. ఎంతలా అంటే స్నేహితులు కానీ, ఎవరైనా కొత్త వాళ్ళు కానీ వచ్చి కాస్త మాకు సహాయం చేయండి అని అడిగితే ఇల్లు కూడా తాకట్టు పెట్టి సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. మా ఆమె నుండి నాన్న పై పెద్ద కంప్లైంట్ అది. ఇప్పటికీ అంటూనే ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు నాని. ఇప్పటికీ మీ అమ్మగారు పనిచేస్తూనే ఉన్నారా అని జగపతి బాబు అడగ్గా, దానికి నాని సమాధానం చెప్తూ ‘నేను 15 సినిమాలు పూర్తి చేసిన తర్వాత కూడా మా అమ్మ పని ఆపలేదు. రిటైర్మెంట్ తీసుకోమని ఇంతా చెప్పినా వినేది కాదు. ఇక ఇలా కుదరదు , నీ ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్పి ఆమె చేత బలవంతంగా ఉద్యోగం ఆపించాను’ అంటూ చెప్పుకొచ్చాడు నాని. ఇలా ఎన్నో విశేషాలను ఆయన ఈ ఇంటర్వ్యూ లో పంచుకున్నాడు. వెంటనే జీ5 యాప్ లో ఈ ఇంటర్వ్యూ ని చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.