Homeఎంటర్టైన్మెంట్Priyamani: వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని ట్రోల్ చేశారు..!

Priyamani: వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని ట్రోల్ చేశారు..!

Priyamani: తెలుగు తమిళ భాషల్లో స్టార్ గా వెలుగొందింది ప్రియమణి. ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ నేషనల్ అవార్డు గెలుపొందింది. పరుత్తివీరన్ చిత్రంలో నటనకు జాతీయ అవార్డు వరించింది. తెలుగులో ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి టాప్ స్టార్స్ తో జతకట్టింది. యమదొంగలో అమాయకురైనా జమిందారు వారసురాలు పాత్రలో మెప్పించింది. ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి కావడం విశేషం. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన యమదొంగ మంచి విజయం సాధించింది.

ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయ్యాక క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. సౌత్, నార్త్ లో ప్రియమణి భారీ డిమాండ్ ఉంది. ది ఫ్యామిలీ మాన్ సిరీస్లో మనోజ్ బాజ్పాయ్ భార్య పాత్రలో ప్రియమణి మెప్పించింది. అటు బుల్లితెర మీద కూడా రాణిస్తున్నారు. పాపులర్ డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జిగా ఆమె వ్యవహరించారు.

కాగా ప్రియమణి కెరీర్ బిగినింగ్ నుండి ట్రోల్స్ కి గురవుతున్నారు. ఆమె కలర్, శరీరం మీద ఇప్పటికీ ట్రోల్స్ వస్తున్నాయని ఆమె ఆవేదన చెందారు. నేను ట్రోల్స్ పట్టించుకోను. నా జీవితం నీ ఇష్టం. నేను ఎవరితో జీవించాలనేది పూర్తిగా నా వ్యక్తిగతమని ప్రియమణి చెప్పుకొచ్చారు. ముస్తఫా రాజ్ ని వివాహం చేసుకోవడంతో ఆమెను కొందరు టార్గెట్ చేశారు. వేరే మతం వ్యక్తిని మీరు ఎందుకు వివాహం చేసుకుంటున్నారని ట్రోల్ చేశారట.

2017లో ప్రియమణి బిజినెస్ మాన్ ముస్తఫా రాజ్ ని వివాహం చేసుకున్నారు. అతడికి ప్రియమణితో రెండో వివాహం. మొదటి భార్యతో ఇప్పటికీ వివాదం నడుస్తుంది. ప్రియమణితో ఆయన వివాహం చెల్లదని భార్య ఆరోపిస్తుంది. ముస్తఫా రాజ్ ఎక్కువగా అమెరికాలో ఉంటారు. ఇండియాలో ప్రియమణి ప్రొఫెషన్ లో బిజీ. పెళ్ళై ఆరేళ్ళు అవుతున్నా పిల్లల్ని కనలేదు. ప్రస్తుతం ఆమె షారుక్ ఖాన్, నయనతార జంటగా నటిస్తున్న జవాన్ మూవీలో కీలక రోల్ చేస్తుంది. ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. అలాగే పలు తమిళ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇటీవల విడుదలైన కస్టడీ మూవీలో కీలక రోల్ చేసింది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper