Homeక్రీడలుHardik Pandya: టెస్టులకు హార్దిక్ పాండ్యా పనికిరాడా..?

Hardik Pandya: టెస్టులకు హార్దిక్ పాండ్యా పనికిరాడా..?

Hardik Pandya: భారత క్రికెట్ లో ప్రస్తుతం ఆల్ రౌండర్ గా జట్టులో స్థిరపడిపోయాడు హార్దిక్ పాండ్యా. జట్టుకు అవసరమైన సందర్భంలో బౌలింగ్, బ్యాటింగ్ తో తన సత్తాను చాటుతున్నాడు ఈ క్రికెటర్. అద్భుతమైన నైపుణ్యం తోపాటు అవసరమైనప్పుడు హిట్టింగ్ చేసి జట్టును గెలిపించగల సమర్థత హార్దిక్ పాండ్యా సొంతం. హార్దిక్ లోని సామర్థ్యాన్ని చూసిన బీసీసీఐ టి20 జట్టు పగ్గాలను కూడా అప్పగించింది. వన్డేలు, టి20ల్లో అదరగొడుతున్న హార్దిక్ పాండ్యా టెస్ట్ జట్టులో మాత్రం స్థానాన్ని దక్కించుకోలేకపోతున్నాడు. ఒకవేళ దక్కించుకున్న ఎక్కువ మ్యాచ్ లు ఆడలేకపోతున్నాడు. దీనికి కారణం హార్దిక్ పాండ్యా ఫిట్నెస్, గతంలో వేధించిన గాయాలు కారణంగా చెబుతున్నారు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఓటమి తర్వాత భారత జట్టు అన్ని విధాలుగా విమర్శలను ఎదుర్కొంటోంది. హార్దిక్ పాండ్యాను ఈ టెస్ట్ మ్యాచ్ కు ఎంపిక చేయకపోవడం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా లాంటి ఆల్ రౌండర్ జట్టులో ఉండి ఉంటే మెరుగైన ఫలితం ఉండేదని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఇదే విషయాన్ని గంగూలి కూడా చెప్పాడు. టెస్టుల్లో హార్దిక్ పాండ్యా ఆడాలంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. అయితే, టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి మాత్రం టెస్టుల్లో హార్దిక్ పాండ్యా ఆడడం అసాధ్యమంటూ తేల్చేశాడు. దీనికి ప్రధాన కారణం తన కెరీర్లో ఎక్కువ సమయాన్ని గాయాలతో వృధా చేసుకున్నాడని ఆయన వెల్లడించాడు.

సుదీర్ఘమైన క్రికెట్ లో హార్దిక్ పాండ్యా రాణించడం కష్టమే..

హార్దిక్ పాండ్యా టి20, వన్డే క్రికెట్ కు మాత్రం సరిగ్గా సరిపోతాడు. టెస్ట్ క్రికెట్ ఆడడంలో హార్దిక్ పాండ్యా ఇబ్బందులు ఎదుర్కొంటాడని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా శరీరతత్వం సుదీర్ఘ క్రికెట్ ను తట్టుకోలేదని పేర్కొంటున్నారు. వన్డే, టి20 క్రికెట్ కు సరిగ్గా సరిపడే క్రికెటర్ హార్దిక్ పాండ్యాగా నిపుణులు పేర్కొంటున్నారు. వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత జట్టుకు సారథ్యం వహించే సామర్థ్యం ఉన్న ఆటగాడిగా హార్దిక్ పాండ్యాను పేర్కొంటున్నారు. టెస్టు క్రికెట్ లో ఐదు రోజులపాటు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ తో శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే తీవ్రమైన గాయాలు బారిన పడి కొన్నాళ్లపాటు క్రికెట్ కు దూరమైన హార్దిక్ పాండ్యా సుదీర్ఘమైన క్రికెట్ ఆడడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే టెస్ట్ క్రికెట్ ఆడలేడని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఆడిన ఎక్కువ కాలం పాటు క్రికెట్లో ఉండలేడని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకునే హార్దిక్ పాండ్యా టెస్టులకు దూరంగా ఉంటున్నాడని, మేనేజ్మెంట్ కూడా వన్డే, టి20 దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేయడం లేదని పేర్కొంటున్నారు.

టి20 జట్టుకు సారధిగా హార్దిక్ పాండ్యా..

బిజీ షెడ్యూల్ తో క్రికెట్ ఆడుతున్న భారత జట్టును రెండు గ్రూపులుగా విభజించి జట్లను ఎంపిక చేస్తుంది బీసీసీఐ. వన్డే, టెస్ట్ క్రికెట్ కు రోహిత్ శర్మ సారధ్యంలోని ఒక జట్టును, టి20 క్రికెట్ కు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని మరో జట్టును బీసీసీఐ ఎంపిక చేస్తోంది. వచ్చే నెల 12వ తేదీ నుంచి వెస్టిండీస్ పర్యటనకు వెళుతున్న భారత జట్టు ఇదే విధమైన జట్లతో క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతోంది. వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా ఒక జట్టును బీసీసీఐ సిద్ధం చేసింది. ఈ జట్టు సుదీర్ఘకాలం పాటు వన్డే ఆడేలా మేనేజ్మెంట్ ప్రణాళిక రచిస్తోంది. ఇకపై వన్డేలు ఆడనున్న జట్టే వన్డే వరల్డ్ కప్ ఆడనుంది.

ఇదీ హార్దిక్ పాండ్యా క్రికెట్ కెరియర్..

హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు 11 టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. ఇందులో 532 పరుగులు ఉన్నాయి. ఇందులో ఒక సెంచరీ, 4 అర్థ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ లోను రాణించిన హార్దిక్ పాండ్యా 17 వికెట్లు తీశాడు. అలాగే వన్డేల్లో ఇప్పటివరకు 74 మ్యాచులు ఆడిన హార్దిక్ పాండ్యా 1584 పరుగులు చేశాడు. తొమ్మిది అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో బౌలింగ్ విషయానికి వస్తే 72 వికెట్లు తీశాడు. అలాగే ఇప్పటివరకు 87 టి20 మ్యాచ్ లు ఆడిన హార్దిక్ పాండ్యా 1271 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ద సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ విషయానికి వస్తే 69 వికెట్లు తీసి సత్తాను చాటాడు హార్దిక్ పాండ్యా. బిజీ షెడ్యూల్ తో క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో హార్దిక్ పాండ్యా వంటి ఆల్రౌండర్ సుదీర్ఘ కాలం పాటు క్రికెట్లో ఉండాలంటే.. టెస్ట్ క్రికెట్ కు పూర్తిగా దూరంగా ఉండటమే మంచిదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular