Viswanath & Sons Preview Show Talk: ‘కరుప్పు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత సూర్య హీరో గా నటించిన ‘విశ్వనాధ్ & సన్స్’ చిత్రం పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ‘లక్కీ భాస్కర్’ వంటి భారీ హిట్ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా , కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో కూడా ఉంది. అందుకే ఈ చిత్రాన్ని అటు తమిళం లోనూ , ఇటు తెలుగు లోనూ మంచి రేట్స్ కి కొనుగోలు చేస్తున్నారు. ఈ నెల 14 న తెలుగు , తమిళం మరియు మలయాళం భాషల్లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ షో ని రీసెంట్ గానే లండన్ లో కొంత మంది ముఖ్యమైన వాళ్లకు వేసి చూపించారట. అత్యధిక శాతం ఆ ప్రివ్యూ షో లో అన్ని ప్రాంతాలకు చెందిన బయ్యర్స్ ఉన్నారట.
వాళ్ళ నుండి లీకైన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమా జానర్ ని బట్టి ఆరంభం లో కాస్త స్లో గానే స్క్రీన్ ప్లే సాగినప్పటికీ, కథ లో దమ్ము ఉండడం తో పాటు , గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమా నడవడం తో ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టడట. ఇంటర్వెల్ కి వచ్చే ట్విస్ట్ ని చూసిన తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ స్టోరీ ని చాలా కాలం తర్వాత డైరెక్టర్ మనకి అందించాడు అనే ఫీలింగ్ వస్తుందట. ఇక సెకండ్ హాఫ్ అయితే ఆరంభం నుండే మంచి డ్రామా తో ముందుకు నడిపించారని , ముఖ్యంగా హీరో సూర్య , మమిత బైజు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు.
ముఖ్యంగా నటిగా మమిత బైజు తనని తానూ నిరూపించుకుందని అంటున్నారు. ఒక పక్క కామెడీ , మరో పక్క ఎమోషన్స్ ని చాలా చక్కగా పలికించిందని , ఆమెలో ఇంత టాలెంట్ ఉందని అసలు ఊహించలేదంటూ ఈ చిత్రాన్ని చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఇక జీవీ ప్రకాష్ కుమార్ అందించే సంగీతం చాలా బాగుందని , అనేక సన్నివేశాలకు ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఊపిరి పోసిందని అంటున్నారు. ఇక క్లైమాక్స్ లో వచ్చే ఒక కీలక ట్విస్ట్ ఆడియన్స్ మైండ్ ని బ్లాస్ట్ చేసే విధంగా ఉందని , దీన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటే సినిమా ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్తుందని అంటున్నారు. మరి ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది తెలియాలంటే మరో 3 రోజులు ఎదురు చూడాల్సిందే.