Paradise : ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువైపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి హీరో పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నారు. దాంతో వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉన్న హీరోల్లో మన హీరోలు మొదటి స్థానంలో ఉండటం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటివరకు మన వాళ్ళు సాధించిన విజయాలు ఇతర భాషల్లోని హీరోలెవరు సాధించకపోవడం విశేషం… నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ‘పారడైజ్’ సినిమాకు సంబంధించిన టీజర్ రెండు రోజుల క్రితం రిలీజ్ అయింది. అయితే ఈ టీజర్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. అందుకే ప్రతి ప్రేక్షకుడు నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రాబట్టడమే కాకుండా సినిమా మీద అంచనాలను మరింత పెంచేసింది.
సూర్య హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో దొరకకుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఈనెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చాలా సాఫ్ట్ గా ఉండటమే కాకుండా వెంకీ అట్లూరి స్టైల్ ఆఫ్ మేకింగ్ లోనే కొనసాగింది. కాబట్టి ఈ ట్రైలర్ కి సైతం ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ వస్తుంది…
ఈనెల 26వ తేదీన యశ్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. కాబట్టి నిన్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ హాలీవుడ్ రేంజ్ లో ఉందనే రెస్పాన్స్ ను రాబట్టింది…
ఈ మూడు సినిమాల నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్లను కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ప్యారడైజ్ టీజర్ రా అండ్ రాస్టిక్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. కాబట్టి అది చాలామంది మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మూడింటిలో పారడైజ్ టీజర్ కే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. యశ్ చేస్తున్న టాక్సిక్ సినిమా ట్రైలర్ సైతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ తో ఈ ట్రైలర్ ని కట్ చేయడం నిజంగా ప్రతి ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇస్తుంది. కాబట్టి టాక్సిక్ సినిమా ట్రైలర్ రెండో స్థానంలో నిలిచింది.
విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా చాలా సాఫ్ట్ గా ఉండడం హ్యూమన్ ఎమోషన్స్ ని ఇందులో చాలా బలంగా చూపించబోతున్నారనే విషయం చాలా క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి ట్రైలర్ అంత ఇంపాక్ట్ ను ఇవ్వకపోయిన కూడా సినిమాలో మాత్రం చాలా కంటెంట్ ఉందనే విషయమైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది…