Homeఎంటర్టైన్మెంట్Agnipariksha 2 Controversy : 'నా చావుకు నువ్వే కారణం అవుతావు నవదీప్' అంటూ ఉప్పల్...

Agnipariksha 2 Controversy : ‘నా చావుకు నువ్వే కారణం అవుతావు నవదీప్’ అంటూ ఉప్పల్ బాలు ఆవేదన.. వీడియో వైరల్..

Agnipariksha 2 Controversy : ‘అగ్నిపరీక్ష 2’ విషయం లో జడ్జీలు ఉప్పల్ బాలు పట్ల చేసిన అన్యాయం పై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వాస్తవానికి ఉప్పల్ బాలు ని సెలబ్రిటీ క్యాటగిరీలో బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతారని అందరూ ఊహిస్తే , ‘అగ్ని పరీక్ష 2’ ఆడిషన్స్ కి రావడమే పెద్ద అన్యాయం అనుకుంటే , కనీసం టాస్కులు కూడా నిర్వహించకుండా , నీవి వల్గర్ వీడియోస్ అని […]

Agnipariksha 2 Controversy : ‘అగ్నిపరీక్ష 2’ విషయం లో జడ్జీలు ఉప్పల్ బాలు పట్ల చేసిన అన్యాయం పై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వాస్తవానికి ఉప్పల్ బాలు ని సెలబ్రిటీ క్యాటగిరీలో బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతారని అందరూ ఊహిస్తే , ‘అగ్ని పరీక్ష 2’ ఆడిషన్స్ కి రావడమే పెద్ద అన్యాయం అనుకుంటే , కనీసం టాస్కులు కూడా నిర్వహించకుండా , నీవి వల్గర్ వీడియోస్ అని చెప్పి ఆడిషన్స్ లో రిజెక్ట్ చేయడం చాలా అన్యాయమని అంటున్నారు. మరో పక్క ఉప్పల్ బాలు తనకు జరిగిన అన్యాయం పై తన ఇన్ స్టాగ్రామ్ లో వీడియోల మీద వీడియోలు చేస్తున్నాడు. ముఖ్యంగా నవదీప్ ని చాలా గట్టిగా టార్గెట్ చేసాడు. లేటెస్ట్ గా ఆయన నవదీప్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఉప్పల్ బాలు మాట్లాడుతూ ‘అగ్నిపరీక్ష 2 గురించి మీకు చాలా నిజాలు జరిగాయి. ఒక విషయం చెప్తాను నవదీప్ , గ్రూప్ డిస్కషన్ లో ఒక హిందీ అమ్మాయి మమ్మల్ని సెలెక్ట్ చేసింది. ఆమెకు తెలుగు రాదు , దేవత లాగా కనిపించింది. నా నవ్వు కి , నేను వేసే జోకులకు ఆమె ఫిదా అయిపోయింది. మళ్లీ సెలెక్ట్ అయ్యినట్టు మెయిల్ కూడా పంపించారు. అన్నీ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసి , స్టేజి మీదకు తీసుకొచ్చిన తర్వాత , నన్ను దారుణంగా అవమానించావు. నీకు ఫ్యాన్స్ ఉన్నారా అన్నావ్ , నువ్వు ట్రాన్స్ జెండర్ వా అని అడిగావు, అసలు నిన్ను ఎవరైనా చూస్తారా అని కూడా అన్నావ్. నేను చేసేవి మొత్తం చిల్లర వీడియోలు అంటూ అవమానించావు. నువ్వు ఎన్ని తప్పు పనులు చేసావో నీ మనసుకి తెలుసు. నేను ఈరోజు చెప్తున్నాను , నా చావుకి నువ్వే కారణం అవుతావు , నిన్ను మాత్రం వదిలిపెట్టే సమస్యే లేదు. నీ మాటలు నాకు చనిపోయేంత బాధని కలిగిస్తోంది’ అంటూ కంటతడి పెట్టుకున్నాడు ఉప్పల్ బాలు.

అయితే సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడుస్తోంది , కానీ నవదీప్ మాత్రం ఇప్పటి వరకు దీనిపై రెస్పాన్స్ ఇవ్వలేదు. మరి ఉప్పల్ బాలు రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్లి ఆపుతాడో చూడాలి. ఇకపోతే కాసేపట్లోనే ఈ షో కి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ని స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ చేయబోతున్నారు. ఈ ఎపిసోడ్ లోనే ఉప్పల్ బాలు ఆడిషన్ ని మనంత చూడొచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper