Sreemukhi: ‘తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘అగ్ని పరీక్ష 2’ నేడు స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ కానుంది. స్టార్ మా ఛానల్ కంటే ముందు జియో హాట్ స్టార్ లో ఈ షోకి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ని అర్థ రాత్రి అప్లోడ్ చేశారు మేకర్స్. ఈ ఎపిసోడ్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాంట్రవర్సీ లేపుతున్న ఉప్పల్ బాలు కూడా ఈ ఎపిసోడ్ లోనే పాల్గొన్నాడు. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం ఎలా ఉందో ఇప్పుడొక చిన్న రివ్యూ లో చూద్దాం.
ముందుగా ఉప్పల్ బాలు విషయానికి వస్తే , అతన్ని నవదీప్ నువ్వు చేసేవి మొత్తం వల్గర్ వీడియోస్ అని సంబోధించడం కరెక్ట్ కాదు. ఉప్పల్ బాలు చాలా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్పాడు, అభిజిత్ కూడా ఇదే మాట చెప్తాడు కానీ, అతన్ని ఆడిషన్స్ సమయం లోనే రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఏముందో అసలు అర్థం కావడం లేదు. కనీసం హోల్డ్ లో పెట్టి , తదుపరి లెవెల్ లో టాస్కులు నిర్వహించి , అప్పుడు సరిగా పెర్ఫార్మ్ చేస్తాడో లేదో చూసి నిర్ణయం తీసుకొని ఉండుంటే బాగుండేది అనిపించింది.
ఇక ఈ ఎపిసోడ్ లో నేరుగా చివరి రౌండ్ కి చేరిన కంటెస్టెంట్ మితిలేష్. ఇతను జడ్జీలను చాలా బాగా ఆకట్టుకున్నాడు, అభిజిత్ లాగా చాలా కూల్ కంటెస్టెంట్ అని కూడా చెప్పాడు. అభిజిత్ కి అయితే ఇతను తెగ నచ్చేసాడు. కుర్చీలో పైకి లేచి నిల్చొని మరీ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. అదే విధంగా షాలిని, సింగర్ ఝాన్సీ లకు రెండు గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చి హోల్డ్ లో పెట్టారు. వీళ్ళు కూడా చాలా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సింగర్ ఝాన్సీ ఒక రైతు బిడ్డ. ఆమె మాట్లాడిన మాటలు చాలా గొప్పగా పద్దతిగా ఉన్నాయి. ఇక షాలిని అయితే చాలా క్యూట్ గా ఉంది. ఈమె చేత షూస్ తుడిపిస్తారు , అంతే కాకుండా ఈమెకు అభిజిత్ అంటే పిచ్చి ఇష్టం, ఒప్పుకుంటే అతన్ని పెళ్లి కూడా చేయూస్కుంటాను అని అంటుంది.
ఇక ఈ ఎపిసోడ్ లో షో లోని జడ్జీలు, యాంకర్ శ్రీముఖి తో పాటు , ఆడియన్స్ కి చిరాకు కలిగించిన కంటెస్టెంట్ ఒకరు ఉన్నాడు. అతని పేరు రన్నింగ్ రాజా. ఈయన ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ బాగా ఫేమస్ అయ్యాడు. కానీ ‘అగ్ని పరీక్ష 2’ ఆడిషన్స్ కి రాగానే శ్రీముఖి ని ఇమిటేట్ చేయడం చాలా చిరాకు కలిగించింది. ఎప్పుడూ ఎంతో జోష్ తో , ఎనర్జీ తో ఉండే శ్రీముఖి, ఇతని పై కోపం తెచ్చుకుంది. ఇమిటేషన్ చేయడం తప్పు కాదు , కానీ అది కించపరిచేలా ఉండకూడదు , ఇతని ఇమిటేషన్ అలాగే ఉన్నింది మరీ. శ్రీముఖి ఇప్పుడు నీ మీద కోపం గా ఉంది , ఆమెని కూల్ చెయ్యి , ఎలా చేస్తావో చూద్దాం అని జడ్జి బిందు మాధవి అడగడం , అందుకు రన్నింగ్ రాజా శ్రీముఖి దగ్గరకి వచ్చి ఏవేవో చేయడం, ‘ముట్టుకోకు చెంప పగలగొడుతాను.. దూరం గా ఉండు’ అని వార్నింగ్ ఇవ్వడం , అతను పదే పదే రిపీట్ చేయడం తో శ్రీముఖి కోపం తో వాకౌట్ చేయడం వంటివి ఈ ఎపిసోడ్ లో హైలైట్ గా నిల్చిన అంశం.
View this post on Instagram