Homeఎంటర్టైన్మెంట్Rajamouli : ఈగ మూవీ విషయంలో ఫెయిల్ అయిన రాజమౌళి... కారణమేంటో చెప్పిన రమా రాజమౌళి...

Rajamouli : ఈగ మూవీ విషయంలో ఫెయిల్ అయిన రాజమౌళి… కారణమేంటో చెప్పిన రమా రాజమౌళి…

Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది. ఇప్పటివరకు ఆయన 12 సినిమాలు చేస్తే 12 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు.. ఆయన అనుకున్న ప్రతి కథను తెరమీద పెర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. అందుకే అతనికి సక్సెస్ రేట్ చాలా ఎక్కువ… ప్రతి ప్రేక్షకుడు తన సినిమాకి ఈజీగా కనెక్ట్ అవుతూ ఉంటాడు. ముఖ్యంగా ఆయన […]

Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది. ఇప్పటివరకు ఆయన 12 సినిమాలు చేస్తే 12 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు.. ఆయన అనుకున్న ప్రతి కథను తెరమీద పెర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. అందుకే అతనికి సక్సెస్ రేట్ చాలా ఎక్కువ… ప్రతి ప్రేక్షకుడు తన సినిమాకి ఈజీగా కనెక్ట్ అవుతూ ఉంటాడు. ముఖ్యంగా ఆయన ఎమోషన్ కి ఎలివేషన్ కి పెద్ద పీట వేస్తూ సినిమాలను చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకుడు అందులో లీనమైపోతాడు. అందుకే అతని సినిమాలకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇదిలా ఉంటే ‘మర్యాద రామన్న’ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్ట్ గా ప్రభాస్ తో ‘బాహుబలి’ సినిమా చేయాలి. కానీ మధ్యలో ‘ఈగ’ కాన్సెప్ట్ రాజమౌళి కి రావడం అది ఆయన్ని బాగా ఎక్సైట్ చేయడంతో ఈ కాన్సెప్ట్ మీద సినిమా చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే రాజమౌళి ఆ సినిమాని స్టార్ట్ చేశాడు. రాజమౌళి ఈ సినిమాని మూడు నెలల్లో కంప్లీట్ చేస్తానని రాజమౌళి నాన్న అయిన విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి భార్య అయిన రమా రాజమౌళికి చెప్పారట… అప్పటికే వాళ్ళిద్దరికి రాజమౌళి గురించి తెలుసు కాబట్టి ఆ మూవీ త్రీ మంత్స్ లో కంప్లీట్ అవ్వదు. కానీ సిక్స్ మంత్స్ పడుతుందని అనుకున్నారట.

రాజమౌళి సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి కొద్ది రోజూ షూట్ చేశాక ఆ కెమెరాలు ఆ ఎక్విప్మెంట్ ఆ సినిమాకి సెట్ అవ్వవని వాటన్నింటిని పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త కెమెరాలు హై టెక్నాలజీని వాడుతూ ఈగ సినిమా తెరకెక్కించారట.

మొత్తానికైతే మూడు నెలలు అనుకున్న ప్రాజెక్ట్ రెండు సంవత్సరాలు అయిందని ఆ విషయంలో రాజమౌళి చాలా వరకు ఫెయిల్ అయ్యాడని తన భార్య రమా రాజమౌళి ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది. తను అనుకున్న డేట్స్ ప్రకారం సినిమాని చేస్తే మూడు నెలల్లో కంప్లీట్ అయ్యేది.

కానీ అవుట్ పుట్ ఎఫెక్ట్ గా వచ్చిండేది కాదని రాజమౌళి పర్ఫెక్షన్ కోసం చాలా కష్టపడతాడు. కాబట్టి తను కాంప్రమైజ్ అవ్వకుండా ఆ సినిమాని హైటెక్నాలజీ తో తెరకెక్కించాడు. అందువల్లే ఆ మూవీని తీయడానికి రెండు సంవత్సరాలు అయిందని ఆమె క్లారిటి ఇచ్చింది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper