Homeఎంటర్టైన్మెంట్Rajamouli: రాజమౌళి విషయంలో తప్పుగా ఆలోచిస్తున్న స్టార్ హీరోల ఫ్యాన్స్...

Rajamouli: రాజమౌళి విషయంలో తప్పుగా ఆలోచిస్తున్న స్టార్ హీరోల ఫ్యాన్స్…

Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి చాలామంది హీరోలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఆయనతో సినిమా చేసిన తర్వాత ఆయా హీరోలు స్టార్ హీరోలుగా మారిపోతున్నారు. ఇక అప్పటినుంచి వాళ్లకు అసలైన ప్రాబ్లం మొదలవుతుంది. ఎలాంటి సినిమాలు చేయాలి ఏ సినిమాలు చేస్తే ప్రేక్షకులు వారిని ఆదరిస్తారు అనే ఒక జడ్జిమెంట్ అయితే వాళ్ళు కోల్పోతున్నారు. రాజమౌళి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ప్రతి ఒక్కరు మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని […]

Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి చాలామంది హీరోలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఆయనతో సినిమా చేసిన తర్వాత ఆయా హీరోలు స్టార్ హీరోలుగా మారిపోతున్నారు. ఇక అప్పటినుంచి వాళ్లకు అసలైన ప్రాబ్లం మొదలవుతుంది. ఎలాంటి సినిమాలు చేయాలి ఏ సినిమాలు చేస్తే ప్రేక్షకులు వారిని ఆదరిస్తారు అనే ఒక జడ్జిమెంట్ అయితే వాళ్ళు కోల్పోతున్నారు. రాజమౌళి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ప్రతి ఒక్కరు మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. అలా కాకుండా చిన్న సబ్జెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ని సాధించి ఆ తర్వాత మళ్లీ పెద్ద ప్రాజెక్టుల వైపు అడుగులు వేస్తే బాగుంటుందని మరికొంతమంది సినిమా మేధావులు చెబుతున్నారు. నిజానికి రాజమౌళి లాంటి దర్శకుడితో సినిమా చేయడం అనేది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఆయన హీరోల క్రేజ్ ను తార స్థాయికి పెంచుతాడు. కానీ ఆ తర్వాత ఆ హీరోలకు సక్సెస్ లు రాక పోవడంతో అంతకు మించిన డౌన్ ఫాల్ ఎదుర్కోవాల్సి ఉంటుంది…

కొంతమంది హీరోల అభిమానులైతే రాజమౌళితో సినిమా చేస్తే ఎంత క్రేజీ వస్తుందో తర్వాత ఆ హీరోకి సరైన సక్సెస్ రాదని రాజమౌళి తో మూవీ చేయడం వేస్ట్ అంటూ అతన్ని విమర్శిస్తున్నారు. నిజానికి అక్కడ రాజమౌళిని విమర్శించేదేమీ లేదు. హీరోలు వాళ్ళ సినిమా సెలక్షన్ లో చాలా వరకు కేర్ఫుల్ గా ఉండాలి.

ఎందుకంటే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఆ తదుపరి వచ్చే సినిమాని ఆ ముందు సినిమాతో పోల్చి చూస్తారు. కాబట్టి అక్కడే డ్యామేజ్ జరుగుతుంది. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే సినిమాలు చేయగలగాలి. లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు.

ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరో కూడా తమ తర్వాత సినిమాలతో సక్సెస్ ని సాధించలేదు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో సక్సెస్ అయ్యాడని చాలామంది అంటున్నారు. కానీ ఆ సినిమా భారీ విజయమైతే కాదు యావరేజ్ హిట్ గా నిలిచింది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper