Homeఎంటర్టైన్మెంట్Nagarjuna: రాజమౌళి - అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున...జక్కన్న రియాక్షన్ ఇదేనా...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆయన ఒక సినిమాను స్టార్ట్ చేసినప్పటి నుంచి రిలీజ్ అయ్యేంతవరకు ఆ సినిమా మీద తప్ప వేరే సినిమా గురించి ఆలోచించడట. తను తర్వాత చేయబోయే సినిమా గురించి కూడా అసలు ఆలోచించారట. అందువల్లే ఆయన చేసే సినిమాల్లో అంత […]

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆయన ఒక సినిమాను స్టార్ట్ చేసినప్పటి నుంచి రిలీజ్ అయ్యేంతవరకు ఆ సినిమా మీద తప్ప వేరే సినిమా గురించి ఆలోచించడట. తను తర్వాత చేయబోయే సినిమా గురించి కూడా అసలు ఆలోచించారట. అందువల్లే ఆయన చేసే సినిమాల్లో అంత పర్ఫెక్షన్ కనిపిస్తుంది. ఆ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించడంలో ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూనే ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది…

ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు ఒకసారి కమిట్ అయితే మాత్రం ఆ సినిమా కోసం ఆయన నెక్స్ట్ లెవెల్లో కష్టపడుతుంటాడు. హీరోలను ఎంత టార్చర్ పెట్టినా కూడా తను అనుకున్నది రాబట్టుకునేంత వరకు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ఫైనల్ గా అతని సినిమాల్లో నటించిన ప్రతి ఒక్క నటుడికి కూడా భారీ క్రేజ్ దక్కుతుంది.

అందుకే అతని సినిమాలో నటించడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడుతుంటారు. ఇక ఇదిలా ఉంటే అఖిల్ ను రాజమౌళి డైరెక్షన్లో నటింపజేయాలని నాగార్జున ప్రయత్నం చేశాడు. కానీ రాజమౌళి మాత్రం వరుసగా భారీ సినిమాలతో బిజీగా ఉండడం వల్ల అఖిల్ తో సినిమా చేయడం కుదరదని నాగార్జునకు చెప్పారట. నాగార్జున సైతం ఓకే అన్నట్టుగా లైట్ తీసుకున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం రాజమౌళి రేంజ్ మారిపోయింది.

ఆయన ఏం చేసినా కూడా అదొక పెను సంచలనంగా మారుతుంది. ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అఖిల్ లాంటి హీరోతో సినిమా చేయడం అనేది అతనికి చాలా ఇబ్బందికరమైన విషయం… అయితే అఖిల్ కి ఎన్ని సినిమాలు చేసిన సక్సెస్ రాకపోవడంతో నాగార్జున రాజమౌళిని సంప్రదించారట. ఇక 2020 వ సంవత్సరంలో ఈ డిస్కషన్స్ అయితే జరిగినట్టుగా తెలుస్తోంది…ప్రస్తుతం అఖిల్ ‘లెనిన్’ మూవీ తో సక్సెస్ సాధించాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper