Homeఎంటర్టైన్మెంట్Varanasi Movie Highlights: 'వారణాసి' మూవీ లో హైలెట్ అయ్యే ఆ రెండు బ్లాక్స్ ఏంటో...

Varanasi Movie Highlights: ‘వారణాసి’ మూవీ లో హైలెట్ అయ్యే ఆ రెండు బ్లాక్స్ ఏంటో చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్..

Varanasi Movie Highlights: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ కి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ రావడంతో రాజమౌళి సైతం సినిమా మీద భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని చాలా డిఫరెంట్ వే లో ప్రజెంట్ చేస్తున్నట్టుగా […]

Varanasi Movie Highlights: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ కి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ రావడంతో రాజమౌళి సైతం సినిమా మీద భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని చాలా డిఫరెంట్ వే లో ప్రజెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తను తనకున్నట్టుగానే ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించగలుగుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… రాజమౌళి ఇప్పటివరకు చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. మరి ఇప్పుడు చేయబోతున్న ఈ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం అలరిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక రెండు బ్లాక్స్ అద్భుతంగా ఉండబోతున్నాయట అవి ఏంటి అనేది కూడా విజయేంద్ర ప్రసాద్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఒకటి కుంభకర్ణుడికి రాముడికి జరగబోయే యుద్ధం.. ఇది 15 నిమిషాల పాటు ఉంటుందట ఆ యుద్ధం ఎపిసోడ్ ప్రేక్షకులందరిని ఒక హై మూమెంట్ లోకి తీసుకెళ్తుందని చెప్పాడు.

అలాగే ఈ సినిమాలోని క్లైమాక్స్ ఎపిసోడ్ లో కూడా ప్రేక్షకులు వేరే ప్రపంచంలోకి వెళ్లిపోయామా అనే రేంజ్ లో పతాక సన్నివేశాలు ఉంటాయని చెప్పాడు. అలాగే ఈ రెండు బ్లాక్స్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తాయని ప్రతి ఒక్క ప్రేక్షకులు ఈ సినిమాకి కనెక్ట్ అవుతారని ఆయన చెప్తుండటం విశేషం…

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో రాజమౌళి మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో భారీ విజయాన్ని సాధించినా కూడా అది ఇండస్ట్రీ హిట్ గా కన్వర్ట్ కాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper