Homeఎంటర్టైన్మెంట్Sandeep Reddy Vanga : మహేష్ కి 'ఓకే'.. పవన్ కి 'నో'.. సందీప్ వంగ...

Sandeep Reddy Vanga : మహేష్ కి ‘ఓకే’.. పవన్ కి ‘నో’.. సందీప్ వంగ తీరుపై ఫ్యాన్స్ అసంతృప్తి..

Sandeep Reddy Vanga : అనేక ఇంటర్వ్యూస్ లో ప్రముఖ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ , తాను పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని చెప్పుకున్న సంగతి తెలిసిందే. నా గురించి తెలిసిన వాళ్లకు ఎవరికైనా తెలుసు , నేను చిరంజీవి , పవన్ కళ్యాణ్ లకు ఎంత పెద్ద ఫ్యాన్ అనేది అని చెప్తుండేవాడు. అంతే కాదు , ప్రతీ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కి సందీప్ వంగ శుభాకాంక్షలు చాలా స్పెషల్ […]

Sandeep Reddy Vanga : అనేక ఇంటర్వ్యూస్ లో ప్రముఖ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ , తాను పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని చెప్పుకున్న సంగతి తెలిసిందే. నా గురించి తెలిసిన వాళ్లకు ఎవరికైనా తెలుసు , నేను చిరంజీవి , పవన్ కళ్యాణ్ లకు ఎంత పెద్ద ఫ్యాన్ అనేది అని చెప్తుండేవాడు. అంతే కాదు , ప్రతీ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కి సందీప్ వంగ శుభాకాంక్షలు చాలా స్పెషల్ గా ఉండేవి. అందులో ఆయనకు పవన్ కళ్యాణ్ పై ఉన్నటువంటి వీరాభిమానం స్పష్టంగా కనిపించేది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ , గత రెండేళ్ల నుండి ఆయన పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలపడం లేదు. అంతే కాకుండా, 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ సంచలన విజయం సాధించినప్పుడు కూడా ఒక్క ట్వీట్ వెయ్యలేదు.

కానీ తమిళనాడు లో విజయ్ సీఎం అవ్వగానే , ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ , భారీ ఎలివేషన్స్ ఇస్తూ ఒక ట్వీట్ వేసాడు. ఇదంతా చూసిన పవన్ ఫ్యాన్స్ తీవ్రమైన నిరాశని వ్యక్తం చేసాడు. సందీప్ వంగ కి అసలు ఏమైంది?, ఎందుకు ఈమధ్య పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొని రావడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో AI తో మహేష్ వీడియో ఒకటి క్రియేట్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు. పాత సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లోని ఒక మాస్ సన్నివేశాన్ని తీసుకొని , దాన్ని మహేష్ తో AI ద్వారా రీక్రియెట్ చేయించి తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసాడు. ఈ వీడియో కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రిగర్ అయ్యారు.

చివరికి మహేష్ బాబు కి కూడా సందీప్ వంగ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు, కానీ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని చెప్పుకుంటూ ఆయనకు మాత్రం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం లేదు, ఇది చాలా అన్యాయం అంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు ‘ఓజీ’ విడుదల సమయం లో టాలీవుడ్ సెలబ్రిటీలందరు ఆ చిత్రాన్ని థియేటర్స్ లో చూసి తమ సోషల్ మీడియా ద్వారా అనుభవాలను పంచుకున్నారు. కానీ సందీప్ వంగ మాత్రం సైలెన్స్ ని మైంటైన్ చేశారు. సెప్టెంబర్ 2 వచ్చేస్తోంది.. కనీసం ఈసారైనా సందీప్ వంగ పవన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతాడో లేదో చూడాలి. ఇకపోతే సందీప్ వంగ ప్రస్తుతం ప్రభాస్ తో ‘స్పిరిట్’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper