Mahesh Babu Childhood Friends: సూపర్ స్టార్ మహేష్ బాబుకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి క్రీజ్ ఉంది. ఇప్పటివరకు ఆయన ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకపోయినా కూడా ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాతో పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. మహేష్ బాబు లాంటి లుక్స్ తో అందంగా కనిపించే హీరో ఇండియాలో మరెవరు లేరనేది వాస్తవం… ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెసులే అతన్ని టాప్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ప్రస్తుతం వారణాసి సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమా మీద భారీ ఎఫర్ట్స్ పెడుతున్నాడు. రీసెంట్ గా ఆయన బర్త్ డే సందర్భంగా మహేష్ బాబుతో కలిసి చదువుకున్న హీరోలు వీళ్లే అంటూ ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా చెక్కర్లు కొడుతుంది. మహేష్ బాబు 25 సంవత్సరాలు వచ్చేంత వరకు చెన్నైలోనే ఉన్నాడు. తన ఎడ్యుకేషన్ మొత్తం చెన్నైలోనే సాగింది.
అక్కడే సెయింట్ పీటర్స్, లయోలా కాలేజీల్లో అతని విద్యాభ్యాసం సాగడం విశేషం… ఇక ఇదిలా ఉంటే అతను చదువుకున్న స్కూల్లోనే సూర్య, కార్తీ తో పాటు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సైతం అదే స్కూల్లో చదువుకోవడం విశేషం…
సూర్య గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు చాలా అల్లరిగా ఉండేవాడని చిన్నప్పుడు స్కూల్ బెంచుల మీద నుంచి ఎక్కి దూకుతూ ఆటలు ఆడుకునే వాళ్ళం అంటూ పాత రోజులను గుర్తు చేసుకున్నాడు. మహేష్ బాబు ప్రతిసారి తన చిన్ననాటి స్నేహితులను కలిసి వాళ్లతో కాసేపు గడిపి వెళ్తారని చెప్పాడు.
ఇక మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు తన స్నేహితుడికి చాలా మంచి ఇంపార్టెన్స్ ఇస్తాడనేది మనం పలు సందర్భాల్లో చూశాం. ఇక అదేవిధంగా తన చిన్ననాటి స్నేహితులకు సైతం అంత మంచి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని కలవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…